https://oktelugu.com/

Rajasaab : రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ దెయ్యంగా కనిపిస్తాడా..?ఆయన తమ్ముడిగా ఆ తమిళ్ స్టార్ హీరో నటిస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయనను పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 02:59 PM IST

    Rajasaab

    Follow us on

    Rajasaab : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయనను పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్న ఏకైక హీరోగా ప్రభాస్ ను చెప్పుకోవచ్చు… మరి ఇప్పటికైనా ఆయన తన తదుపరి సినిమాలతో మరిన్ని సక్సెస్ లను సాధించి బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తులో ఎదిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న హీరో ప్రభాస్… ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. మొత్తానికైతే ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. మరి ఎప్పుడైతే ఆయన పాన్ ఇండియా సినిమా చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులందరూ పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుంది అనేది ఇప్పుడు ట్రేడ్ పండితుల్లో కూడా లెక్కలు అయితే వేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే మారుతి డైరెక్షన్ లోనే ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి రాజాసాబ్ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ చనిపోయి ఘోస్ట్ గా మారతారట. మరి ఆయన దయ్యంలా మారిన తర్వాత ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనేదే తెలియాల్సి ఉంది.

    ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ ఒక వార్త అయితే వినిపిస్తోంది. ఇక ప్రభాస్ తమ్ముడి పాత్రలో ఆయన ఒక పది నిమిషాల పాటు కనిపించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…

    మరి ప్రభాస్ ని ఎవరు చంపుతారు ఆయన దెయ్యం గా ఎందుకు మారుతాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మీద ఎలాంటి అప్డేట్స్ రానప్పటికి తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    అయితే ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మారుతికి ఇది చాలా చక్కటి అవకాశం… తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునేట్లైతే స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కూడా దక్కుతుంది. లేదంటే మళ్లీ ఆయన మిడిల్ రేంజ్ హీరోలకి పరిమితం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…