ఏపీలో పరిషత్ ఎన్నికలపై సందిగ్ధం?

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఎన్నికలు అసలు జరుగుతాయా? జరగవా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని.. వైసీపీ నేతలు ఇది చేయించారని.. అందుకే మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించారని టీడీపీ సహా వివిధ పార్టీల నేతలు హైకోర్టుకు ఎక్కారు. అయితే కొత్తగా ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని గత మార్చిలో […]

Written By: NARESH, Updated On : April 4, 2021 8:07 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఎన్నికలు అసలు జరుగుతాయా? జరగవా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకు చేరింది.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని.. వైసీపీ నేతలు ఇది చేయించారని.. అందుకే మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించారని టీడీపీ సహా వివిధ పార్టీల నేతలు హైకోర్టుకు ఎక్కారు.

అయితే కొత్తగా ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని గత మార్చిలో ఆగిపోయిన పరిషత్ ఎన్నికల నుంచే నిర్వహిస్తున్నారు. అప్పుడు వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారనే ఆరోపణలున్నాయి.

ఇప్పుడు అదే ఎన్నికలను.. అక్కడి నుంచే కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని నిర్వహించడంపై టీడీపీ నేతలు, ఇతర ప్రతిపక్షాలు హైకోర్టుకు ఎక్కాయి.