Pawan Kalyan vs Ambati : జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నలకు వైసీపీ నేతల దగ్గర జవాబు ఉండడం లేదు. ఎంతసేపు పవన్ పై పడి ఏడ్వడం తప్పితే ప్రజా సమస్యలు, దోపిడీ గురించి సమాధానాలు ఇవ్వలేని దుస్థితికి వైసీపీ మంత్రులు దిగజారారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు రెండున్నర లక్షల పరిహారం దోచుకున్నాడని పవన్ నిరూపించినా దానికి సమాధానం ఇవ్వలేని మంత్రి అంబటి రాంబాబు తాజాగా పవన్ పై మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగారు. తాజాగా పవన్ మగతనంపై నోరుపారేశారు.

ఓట్లు చీలనివ్వనని పవన్ చెబుతున్నారని.. పవన్ అంత మగాడా’ అంటూ అంబటి రెచ్చిపోయారు. కాపులు పవన్ వెంట ఉంటారో.. జగన్ వెంట ఉంటారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కచోట గెలవలేని పవన్ తనపైన ఆరోపణలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. దీన్ని బట్టి మరోసారి పవన్ ను వ్యక్తిగతంగా వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేసిందనే చెప్పాలి.
వైసీపీ మొదటి నుంచి కులాన్ని, వ్యకిగత జీవితాన్ని పట్టుకొనే వైసీపీ రాజకీయం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వదిలి జనసేననే ప్రత్యర్ధిగా చూస్తూ కాపు మంత్రులు తిట్లపురుణాలు ఎత్తుకున్నారు. అంబటి, పేర్నినాని, అమర్నాథ్,కన్నబాబు లాంటి వాళ్లు మైక్ దొరికితే అంతెత్తుకు లేచి.. పవన్‌ని తిడుతుంటారు. అంబోతు అంబటికి అయితే నోటికి హద్దేలేదు. వాస్తవం మాట్లాడితే కాపుల్ని జగన్ కాళ్ల దగ్గర పెట్టింది ఈ వైసీపీ కాపు నాయకులు కారా..? కాపులకు మంత్రి పదవులు ఇచ్చారని, పథకాలు పెట్టారని చెప్పుకుంటున్నారు. వీరే కాపుల్ని సీఎం చేసుకునే సత్తా లేదా..? ఇంకా ఊడిగం చేయాలనే ఉద్దేశంతోనే అంబటి లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిజానికి కాపులకు కోసం పోరాడుతుంది.. పపన్ కాదా..? వారి ప్రయోజనాల కోసం గొట్లాడుతుంది పవన్ కాదా? అంబటికి తప్ప తాగి కళ్లు మూసుకుపోయి ఇలా మాట్లాడుతున్నారనే సందేహం సగటు రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, కాపుల రిజర్వేషన్ల గురించి ఎందుకు ఈ కాపు నాయకులు నోరెత్తటం లేదంటే.. జగన్ అంటే వారి భయం. జగన్ ఇచ్చిన పదవులు తీసుకొని పవన్ పై ఇలా నోరుపారేసుకుంటున్నారు. మరీ గలీజుగా మారి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.