Unstoppable Prabhas : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్దీ కాలం క్రితమే ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ షో లో పాల్గొన్న సంగతి అందిరికీ తెలిసిందే..ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..ప్రభాస్ తో పాటుగా గోపీచంద్ కూడా పాల్గొన్న ఈ ఎపిసోడ్ కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

కారణం ప్రభాస్ ఒక టాక్ షో పాల్గొనడం ఇదే తొలిసారి..పైగా నందమూరి బాలకృష్ణ తో ప్రభాస్ కలయిక అంటే సాధారణంగానే అంచనాలు ఉండడం సహజం..అలాంటి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ ఎల్లుండి నుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..అయితే ఇక్కడే ఆహా మీడియా మరో ట్విస్ట్ ఇచ్చింది..ప్రభాస్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.
అసలు విషయానికి వస్తే ‘అన్ స్టాపబుల్’ ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారట..మొదటి భాగం 30 వ తేదీన టెలికాస్ట్ కాబోతుండగా..రెండవ భాగం జనవరి ఆరవ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారట..అయితే ప్రోమో లో చూపించిన సన్నివేశాలు మొదటి పార్ట్ లో ఉంటాయా..లేదా రెండవ పార్ట్ లో ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది..ప్రోమో లో ప్రభాస్ రామ్ చరణ్ తో ఒకసారి మాట్లాడుతాడు..’ఒరేయ్ చరణ్..నువ్ నాకు స్నేహితుడివా..శత్రువువా’ అనేది ఉంటుంది కదా..అది రెండవ భాగం లో ఉండబోతుందట..ఇద్దరు హీరోలు మాట్లాడుకున్న అరుదైన ఘట్టం కాబట్టి దానిని రెండవ ఎపిసోడ్ వరకు పొడిగిస్తే ఎక్కువ వీక్షకులు చూసే అవకాశం ఉంటుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట..ఆద్యంతం వినోదభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.