Chhaava Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికి అవి ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ‘ఛత్రపతి శివాజీ’ కొడుకు అయిన ‘శంబాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా బాలీవుడ్ లో పెను రికార్డులను సైతం తిరగరాసింది. ఈ రోజు తెలుగులో డబ్ చేసి ధియేటర్లలోకి తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: బాలీవుడ్ ఇండస్ట్రీ నాకు నచ్చడం లేదు అందుకే వదిలేస్తున్న అంటూ సంచలన కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఛత్రపతి మహారాజ్ చనిపోవడంతో మొగలులు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంబాజీ మహారాజ్ తన తండ్రి బాధ్యతను స్వీకరించి తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇందులో భాగంగానే మొత్తానికైతే ఔరంగజేబు తన పంతాన్ని నెగ్గించుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ అనే దర్శకుడు చాలా సెన్సిబుల్ అంశాలను జోడించి వాటిని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నమైతే చేశాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా మరాఠా సామ్రాజ్యాధినేత అయిన శంబాజీ మహారాజ్ కాలంలోకి వెళ్లిపోయాము అనే ఒక ఫీల్ అయితే కలుగుతుంది. మొదటి నుంచి ఈ సినిమాను ఎంగేజింగ్ గా తీసుకెళ్లిన దర్శకుడు ఇంటర్వెల్ కి వచ్చేసరికి మాత్రం హై రేంజ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.
ఇక ఇంతకుమించి సినిమాలో ఏముంటుంది అనుకున్న ప్రతి ప్రేక్షకుడిని డెప్త్ గా కథలోకి తీసుకెళ్ళి సెకండాఫ్ ని మాత్రం అమాంతం ఆకాశం అంత ఎత్తులోకి తీసుకెళ్లి వదిలేశారనే చెప్పాలి. ఇక శంభాజీ మహారాజ్ చేసే యుద్ధం ఆయన గెలిచే సామ్రాజ్యం చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నమైతే చేశారు. నిజానికి ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే ఛత్రపతి శివాజీ అనే చెప్పాలి. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు…కానీ తన కొడుకు అయిన శంబాజీ మహారాజ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.
అయినప్పటికి ఆయనకు ఇంత గొప్ప చరిత్ర ఉందని ప్రేక్షకులకు దర్శకుడు తెలిసేలా చేశారు. అసలు విషయాన్ని వక్రీకరించి మొఘలుల గురించి ఔరంగజేబు గురించి పుస్తకాలలో రాసినవన్ని అబద్ధాలే అంటూ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం మండిపడుతున్నారు. ఇక యావత్తు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ సినిమా హవా అనేది ఎక్కువగా కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే ఎపిసోడ్స్ అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేస్తాయి… ఇక ఈ సినిమా కోసం వేసిన సెట్లు బాగున్నాయి. అప్పటి కాలాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేలా రీక్రియేట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ ని కూడా చాలా అందంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాని విక్కీ కౌశల్ ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లడనే చెప్పాలి. శంభాజీ మహారాజ్ పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఒక ఫీల్ ని కలిగించేలా తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ముందుకు సాగాడు. నిజానికి ఈ సినిమాలో శంభాజీ పాత్రకి విక్కీ కౌశల్ తప్ప వేరే హీరో ఎవరు సెట్ అయ్యేవారు కాదు అనేంతలా తన నటనతో ప్రేక్షకుడిని మెప్పించిన ఘనత కూడా అతనికే దక్కుతుంది… ఇక మిగతా పాత్రలను పోషించిన వారు సైతం వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా ఔరంగజేబు పాత్రను పోషించిన నటుడు తన నటనలోని పరిణితిని చూపిస్తూ ఒక విలనిజాన్ని పండించే ప్రయత్నమైతే చేశాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ని అందించాడు. ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉంది అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో గాని, సంగా విషయంలో గానీ ఆయన ఎక్కడ కూడా తన మార్కు ను చూపించలేకపోయాడు. ఈ సినిమాలోని ఎమోషనల్, ఎలివేషనల్ సీన్స్ కి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ కనక పడితే ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఏఆర్ రెహమాన్ ఇంతలా డిసప్పాయింట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. కానీ ఆయన మాత్రం ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడనే చెప్పాలి. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా చూపించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక లక్ష్మణ్ ఉటేకర్ ను నమ్మి ప్రొడ్యూసర్స్ కూడా భారీ రేంజ్ లో ఖర్చు పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్
విక్కీ కౌశల్ యాక్టింగ్
విజువల్స్
ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్
మ్యూజిక్…
స్టార్టింగ్ లో కొంచెం స్లో అయింది…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5