Amazing scenery in Telangana ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూరా ఎన్నో అడవులు ఉండేవి. దట్టమైన వికారాబాద్ అడవులు వనమూలికలకు నిలయంగా ఉండేవట.. ఇక వరంగల్, నల్గొండ, కరీంనగర్ లవైపు దట్టంగా అడవులు ఉండేవి. హైదరాబాద్ విస్తరణతోపాటే అవి అంతరించిపోయాయి. కానీ తెలంగాణ సర్కార్ వచ్చాక ప్రభుత్వ భూముల్లో కొన్ని వందల ఎకరాల్లో పార్క్ లుగా మినీ అడవులను పెంచుతోంది. ముఖ్యంగా రహదారులు, రైల్వే ట్రాక్ లవైపు సినీ, రాజకీయ ప్రముఖులకు దత్తత ఇస్తూ వీటిని పెంచి పోషిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గడిచిన 8 ఏళ్లుగా హరితహారంలో భారీగా మొక్కలను పెంచుతోంది. అవి పచ్చగా పెరిగి చిన్న సమీప అడవులుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు ముఖ్యంగా రహదారుల పక్కన పచ్చటి కోకను సంతరించుకున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే దారిలో అద్భుతమైన అటవీ సంపద కనువిందు చేస్తోంది. సాయికాంత్ కృష్ణ అనే ఓ నెటిజన్ తాజాగా ఎన్.హెచ్163ని అద్భుతంగా క్లిక్ మనిపించాడు. డ్రోన్ సాయంతో తీసిన ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మంత్రి కేటీఆర్, హాయ్ హైదరాబాద్ కు ట్యాగ్ చేశాడు.
ఆ అద్భుతమైన పచ్చందనానికి కేటీఆర్, నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. వాటిని రీట్వీట్ చేస్తూ తెలంగాణలో పచ్చదనాన్ని నలుచెరుగులా చాటిచెప్పారు. ఓవైపు సర్వీస్ రోడ్డు.. మరోవైపు రైల్వే ట్రాక్.. మధ్యలో నేషనల్ హైవేకు చుట్టూరా ఉన్న చెట్లతో ఓ పచ్చదనం వెల్లివిరిసింది.
డ్రోన్ ఫొటో చూస్తుంటే నిజంగానే ఏదో విదేశాల్లో ఉన్న ఫొటోలాగా కనిపిస్తోంది. కానీ ఇదీ మన తెలంగాణలోనిది.. పైగా హైదరాబాద్ శివారులోనిది అని తెలిసేసరికి అందరూ అవాక్కవుతున్నారు. ఇంతటి అందాలు మనవద్దే పరుచుకున్నాయని అందరూ అబ్బురపడుతున్నారు.
https://twitter.com/iamsaikanth/status/1545021001431298048?s=20&t=qZgeKGfb4XOv3ul2dv6dow