Rajamouli Mistakes In RRR Movie: ఎంత మేధావి అయినా ఒక్కో సారి తప్పు చేయడం మామూలే. అదేదో తెలిసి చేసిన తప్పు కాదని తెలుసుకున్నా మనం గుర్తిస్తే ఇంత నిర్లక్ష్యం ఎలా వహించారనే ప్రశ్నలు రావడం సహజమే. దీంతో ఎంత తెలివిపరుడైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు చేయడం తెలిసిందే. అది యాదృచ్ఛికంగా జరిగిందైనా కావాలని చేసిందైనా తప్పు తప్పే. దాని తాలూకు గుర్తులు ఎప్పటికి వెంటాడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు తప్పులే చేయమని చెప్పవద్దు. ఇలా ఎక్కడో ఒక చోట దొరికితే తలవంచుకోవాల్సిందే. కానీ చేసే తప్పులకు ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుందని మాత్రం తెలసుకోవాలి.
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల నిర్మాణంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటాడో తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధిస్తుంటాయి. ఒక్కో సన్నివేశానికి అన్ని దారుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. అందుకే స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ వరకు అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. సినిమా సినిమాకు తనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ సినిమాల సక్సెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Director B. Gopal: అప్పటి ముచ్చట్లు : ఆ తింగరి గోపాలమే.. నేడు తిరుగులేని డైరెక్టర్ అయ్యాడు
ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి ఓ తప్పు చేసినట్లు తెలుస్తోంది. ఇది పెద్ద తప్పు కాకపోయినా సరిగా పరిశీలిస్తే అర్థమవుతుంది. కానీ ఎవరు కూడా అంత తీక్షణంగా దృష్టి పెట్టలేదు. కానీ అది జాగ్రత్తగా పరిశీలిస్తే అంత తప్పు ఎలా చేశాడనే వాదనలు వస్తున్నాయి. ఎంత పెద్ద మేధావి అయినా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తాడనే ఉద్దేశాన్ని నిజం చేస్తూ రాజమౌళి ఈ తప్పు చేసినట్లు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ సన్నివేశంలో బ్రిటిష్ వారి మీదకు అడవి జంతువులను వదిలే సీన్ ఉంది.
అక్కడ ఒకే బోనులో ఒకపక్క రెండు పులులు, మరో పక్క జింకలు ఉంటాయి. ఒకే బోనులో పులులు, జింకలు ఉంటే వాటిని పులులు తినేయవా? ఇంత చిన్న లాజిక్ ను రాజమౌళి ఎలా మిస్సయ్యాడు. ఆయనకు ఆలోచన తట్టలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఆ సీన్ ఒకేసారి వచ్చిపోవడంతో ఎవరు కూడా పెద్దగా ఆలోచించకపోయినా సరిగా ఆలోచిస్తే మాత్రం అదో పెద్ద తప్పిదంగానే కనిపిస్తుంది. రాజమౌళి లాంటి వారు ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడు చెప్మా అనే అనుమానాలు అందరిలో చోటుచేసుకుంటున్నాయి. ఎవరైనా తప్పులకు అతీతులు కారనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి.