https://oktelugu.com/

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్రంప్ లాంటి వాడేనా?

Boris Johnson: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఎప్పుడు వివాదాల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి తప్పు చేయడం క్షమాపణలు కోరడం వంటి పనులు ఆయనకు కొత్తేమీ కాదు. కానీ అదే ఆయన మెడకు చుట్టుకుంది. ఎప్పుడు తప్పులు చేసే జాన్సన్ పై అందరు మద్దతు తెలపడం లేదు. దీంతో ఆయన తన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు తిప్పలు పడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా ఆయనపై వివాదాలు రావడం సంచలనం కలిగిస్తోంది. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనడానికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 7, 2022 / 08:15 PM IST
    Follow us on

    Boris Johnson: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఎప్పుడు వివాదాల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి తప్పు చేయడం క్షమాపణలు కోరడం వంటి పనులు ఆయనకు కొత్తేమీ కాదు. కానీ అదే ఆయన మెడకు చుట్టుకుంది. ఎప్పుడు తప్పులు చేసే జాన్సన్ పై అందరు మద్దతు తెలపడం లేదు. దీంతో ఆయన తన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు తిప్పలు పడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా ఆయనపై వివాదాలు రావడం సంచలనం కలిగిస్తోంది. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనడానికి ఇదే నిదర్శనం. పలు వివాదాల్లో ఇరుక్కుని చివరకు శిక్ష అనుభవించాల్సి రావడం ఆందోళనకరమే.

    Boris Johnson

    ఎప్పుడు కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కానీ తరువాత మళ్లీ క్షమాపణలు కోరడం కూడా తెలిసిందే. గతంలో ఆయన ఇంటికి చేసుకున్న మరమ్మతుల విషయంలో నానా గొడవలు జరిగాయి. ఆయన పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి తన ఇంటిని బాగు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అప్పుడు కూడా ఆయన క్షమాపణలు కోరడం సంచలనం కలిగించింది. ఈ మేరకు బోరిస్ జాన్సన్ జీవితమే క్షమాపణల ఫలితం అని తేలిపోయింది.

    Also Read: Chandrababu Ring: చంద్రబాబు చేతి వేలికి ఉన్న ఉంగరం వెనుక పెద్ద కథే ఉందే?

    జాన్సన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓవెన్ పాటెర్సన్ అవినీతికి పాల్పడటంతో పార్లమెంట్ స్టాండర్డ్ కమిటీ విధించిన సస్పెన్షన్ ను ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో జాన్సన్ పై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కూడా జాన్సన్ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇక కరోనాతో అందరు బాధపడుతుంటే తాను మాత్రం జన్మదిన వేడుకలు జరుపుకుని మరోమారు వివాదంలో ఇరుక్కున్నారు. కరోనా సమయంలో బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించడంతో దేశమంతా విషాదం అలుముకున్న సమయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని అందరి విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు.

    Boris Johnson

    అప్పుడు కూడా బ్రిటన్ రాణికి జాన్సన్ క్షమాపణ చెప్పాల్సి రావడం గమనార్హం. ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ గా వివాదాస్పదుడైన క్రిస్ పించర్ ను నియమించి మరోసారి వివాదాల్లో దూరారు. తరువాత కాలంలో ఆయన మంచివాడు కాదని తెలుసుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. బోరిస్ జాన్సన్ తీరుతో మంత్రులు సైతం తమ పదవులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్ తీరు విమర్శలకు తావిచ్చింది.

    జాన్సన్ పార్టీ కన్జర్వేటివ్ కూడా వివాదాల పాలైంది. ఇందులో ఉన్న మంత్రులందరిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మంత్రులపై లైంగిక వేధింపుల కేసులు కూడా పెట్టడం తెలిసిందే. దీంతో బోరిస్ జాన్సన్ తీరు విమర్శలమయంగా మారింది. ఓ ఎంపీ ఏకంగా పార్లమెంట్ జరిగే సమయంలోనే నీలి చిత్రాలు చూడటం సంచలనం కలిగించింది. దీంతో జాన్సన్ పరిపాలన తీరుపై సర్వత్రా ఆందోళన కలిగింది. ఓ ఎంపీ 15 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలపై పదవీచ్యుడు కావడం తెలిసిందే.

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్ని ఆరోపణలు వచ్చాయో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జీవితం కూడా వివాదాలమయంగా మారడం తెలిసిందే. దీంతో ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం సాధారణమే. దీంతో బోరిస్ జాన్సన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో రావడం గమనార్హం.

    Also Read:Ponniyin Selvan: సౌత్ సినిమాకి రేపు పండగే.. భారీ మల్టీస్టారర్ గ్లింప్స్ రెడీ

    Tags