https://oktelugu.com/

Jio : జియో నుంచి అదిరిపోయే ఆఫర్..ఇతరులకు కూడా నెట్ ఫ్రీగా ఇవ్వచ్చు. మీకు అన్ లిమిటెడ్. ఎలాగంటే?

జియో తన వినియోగదారులకు అన్ లిమిటెడ్ 5G డేటాను అందించనుంది. దీని కోసం చక్కటి ఆఫర్ ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ వినియోగదారులకు అందిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 27, 2024 / 07:53 AM IST

    Jio

    Follow us on

    Jio : జియో తన వినియోగదారులకు అన్ లిమిటెడ్ 5G డేటాను అందించనుంది. దీని కోసం చక్కటి ఆఫర్ ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఆఫర్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని జియో ఆశిస్తోంది. ఈ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు? అయితే మీరు సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ 5G డేటాను ఆస్వాదించవచ్చు. కేవలం రూ.601 పెట్టి ‘జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్’ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సంవత్సరం మొత్తం 5జీ సేవలు పొందే అవకాశం ఉంటుంది.

    దీనికోసం రూ.601 పెట్టాల్సి ఉంటుంది. దీని వల్ల 5G అప్‌గ్రేడ్ గిఫ్ట్ వోచర్ ను తీసుకొని మై జియో యాప్ ద్వారా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీన్ని 4జీ వినియోగదారులు కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించింది. అంటే ఇప్పటికే 4జీ సేవలు పొందుతున్న జియో వినియోగదారులు 5జీ సేవలు పొందవచ్చు. దీన్ని వోచర్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

    అయితే ఈ 5G డేటా వోచర్‌ను ఉపయోగించాలంటే కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఇప్పటికే కనీసం 1.5 GB నెలవారి ప్లాన్ గా పొందాలి. అంటే 4G డేటాకు నెలవారీ లేదా త్రైమాసిక ప్లాన్‌లో రీఛార్జ్ చేసుకొని ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే రోజుకు 1 GB డేటా ప్లాన్‌లో ఉన్న వారికి, రూ.1,899 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లో ఉన్న వారికీ ఈ వోచర్ పని చేయదు అంటున్నారు అధికారులు. అంటే రోజుకు 1 GB డేటా వినియోగించుకునే వారు మాత్రం ఈ 5G సేవలను పొందలేరు.

    జియో ట్రూ 5G అపరిమిత డేటా గిఫ్ట్ వోచర్
    వినియోగదారులు జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్‌ను తమకోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా గిఫ్ట్ గా అందించే అవకాశాన్ని కూడా కల్పించింది జీయో. మై జియో యాప్ ద్వారా ఈ వోచర్ ని వేరొకరికి బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఈ వోచర్‌ను ఉపయోగించి అదనపు ప్రయోజనాలను పొందాలంటే కూడా అర్హత ఉండాలి. అంటే వారు కనీసం బేసిక్ ప్లాన్‌లో ఉండాలి అంటున్నారు అధికారులు.

    జియో అపరిమిత 5G డేటా వోచర్ రూ.199, రూ.239, రూ.299, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.769, రూ.899 రీఛార్జ్ ప్లాన్‌లలో ఉన్నవారికి పనిచేసేలా ప్లాన్ చేశారు. వారు ఉపయోగించే బేసిక్ ప్లాన్‌ను బట్టి 5G డేటా వోచర్ చెల్లుబాటు ఉంటుందట. గరిష్టంగా 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా కూడా ప్లాన్ చేశారు.

    5G డేటా వోచర్ యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు 3 GB రోజువారీ 4G డేటాతో పాటు, అపరిమిత 5G డేటాను కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు జియో రూ.51 (1 నెల), రూ.101 (2 నెలలు), రూ.151 (3 నెలలు) ధరలలో 5G వోచర్ ప్లాన్‌లను అందించేలా వెసులుబాటు చేశారు.