ఆంధ్రప్రదేశ్ లో పవర్ పాలిటిక్స్ కు బలైపోయారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు కష్టాలు దాపురించాయి. టీడీపీ తరుఫున ఆర్థిక అండదండలు అందిస్తున్న ఈయనపై జగన్ సర్కార్ నజర్ పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఆయన ప్రత్యర్థులైన టీడీపీ నేతలకు, వారి కంపెనీలకు కష్టకాలం మొదలైంది. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం సారథ్యంలో నెలకొల్పిన దేశంలోనే ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ ‘ఆమెరూన్’ సంస్థకు కష్టాలు వచ్చిపడ్డాయి. కాలుష్యం కారణంగా ఏపీ సర్కార్ ఈ ప్లాంట్ మూసివేతకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. పర్యావరణ నిబంధనలు పాటించడం లేదంటూ చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ ప్లాంట్ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో మూసివేత ఉత్తర్వులు నిలిచిపోయాయి.
జగన్ సర్కార్ తో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు విభేదాల కారణంగా.. అనవసరంగా తమ కంపెనీలపై దెబ్బ పడుతుందని.. అందుకే ఏపీ నుంచే అమరరాజా బ్యాటరీస్ తరలించాలని గల్లా జయదేవ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
బిలియన్ డాలర్ల టర్నోవర్ ఈ అమరరాజా బ్యాటరీస్ సొంతం. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాటరీల కంపెనీ ఇది. చిత్తూరు జిల్లాలోని తన బ్యాటరీల ప్లాంటును తమిళనాడుకు తరలించాలని గల్లా జయదేవ్ యోచిస్తున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అమరరాజా బ్యాటరీస్ చెన్నైకి తరలించబోతోందని.. ఆ సంస్థకు తమిళనాడు సీఎం స్టాలిన్ రెడ్ కార్పైట్ పరిచాడరని.. ఇప్పటికే కేటాయించిన స్థలంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని.. మూడు నెలల్లోనే చిత్తూరు నుంచి ప్లాంట్ తమిళనాడుకు మారుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
కాగా ఈ వార్తకు సంబంధించి అటు అమరరాజా సంస్థ నుంచి లేదా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటనలు వెలువడలేదు.