https://oktelugu.com/

మీరు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. తక్కువ వడ్డీకి చిట్కాలు ఇవే?

చాలా సందర్భాల్లో మనం తీసుకునే రుణాల వల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మనం అప్పు కంటే వడ్డీని ఎక్కువగా చెల్లించాలి. ఒకవేళ మనం వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకుంటే మాత్రం కొన్ని చిట్కాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలా చేయడం వల్ల రుణంపై వడ్డీరేటు తగ్గడంతో పాటు క్రెడిట్ స్కోర్ ను బట్టి తీసుకునే రుణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. క్రెడిట్ విలువను సూచించే మూడు అంకెల సంఖ్యను క్రెడిట్ స్కోర్ అని అంటారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 2, 2021 / 09:24 PM IST
    Follow us on

    చాలా సందర్భాల్లో మనం తీసుకునే రుణాల వల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మనం అప్పు కంటే వడ్డీని ఎక్కువగా చెల్లించాలి. ఒకవేళ మనం వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకుంటే మాత్రం కొన్ని చిట్కాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలా చేయడం వల్ల రుణంపై వడ్డీరేటు తగ్గడంతో పాటు క్రెడిట్ స్కోర్ ను బట్టి తీసుకునే రుణాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

    క్రెడిట్ విలువను సూచించే మూడు అంకెల సంఖ్యను క్రెడిట్ స్కోర్ అని అంటారు. క్రెడిట్ కార్డ్ హిస్టరీ ఆధారంగా దీనిని నిర్ణయించడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉండే అవకాశం ఉండగా ఎక్కువ స్కోర్ వల్ల బాధ్యతాయుతమైన రుణగ్రహీతగా పేరు రావడంతో పాటు రుణం వెంటనే లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించడం కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి.

    బ్యాంకులకు తక్కువ రిస్క్ ఉన్న రుణదాతగా మారడంతో పాటు లోన్ ఆఫర్‌లను కూడా పొందడం సాధ్యమవుతుంది. రుణం తీసుకోవడానికి సరైన బ్యాంకును ఎంచుకోవాలి. అన్ని బ్యాంకుల రుణాలను సరిపోల్చి రుణాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ.ఎం.ఐ లేని చోట రుణం తీసుకోవడం వల్ల వడ్డీని ఆదా చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు పలు సందర్భాల్లో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి.

    క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్లను రుణాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల నుంచి పండగ సీజన్ కావడంతో బ్యాంకులు చాలా ఆఫర్లను ప్రకటించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇందులో కొన్ని బ్యాంక్ ఖాతాల ఆఫర్లను కచ్చితంగా పరిశీలించుకోవాలి. టాటా క్యాపిటల్ పర్సనల్ లోన్, సిటీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, తక్కువ వడ్డీకే రుణాలతో పాటు పలు ఆఫర్లను ఇస్తున్నాయి.