https://oktelugu.com/

అమరావతి ఉద్యమం.. రైతుల చూపు ఆయనవైపే

ఆంధ్రప్రదేశ్ రాజధానిని వికేంద్రీకరించడాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా రైతులు సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధానికోసం భూములు ఇచ్చిన సంఘటనలు తలుచుకుంటున్నారు. అయితే.. వారి ఆందోళనకు మద్దతిచ్చే ఓ బలమైన శక్తే లేకుండా పోయింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన టీడీపీ.. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో ఓ పార్టీగా మద్దతివ్వడమే తప్ప.. ఏమీ చేయలేకపోతోంది. Also Read: బీజేపీ వర్సెస్ జనసేన..! బీజేపీ, జనసేన […]

Written By: , Updated On : December 13, 2020 / 12:03 PM IST
Follow us on

amaravati farmers
ఆంధ్రప్రదేశ్ రాజధానిని వికేంద్రీకరించడాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా రైతులు సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధానికోసం భూములు ఇచ్చిన సంఘటనలు తలుచుకుంటున్నారు. అయితే.. వారి ఆందోళనకు మద్దతిచ్చే ఓ బలమైన శక్తే లేకుండా పోయింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన టీడీపీ.. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో ఓ పార్టీగా మద్దతివ్వడమే తప్ప.. ఏమీ చేయలేకపోతోంది.

Also Read: బీజేపీ వర్సెస్ జనసేన..!

బీజేపీ, జనసేన మద్దతున్నా..
అమరావతి రైతులకు భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతు తెలుపుతున్నా.. మూడు రాజధానులను ఏపీ సర్కార్ అమలు చేస్తే తామేం చేయలేమంటున్నారు. దీంతో అమరావతి రైతులకు ఉన్న ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలో వారు ఆయనవైపే చూస్తున్నారు.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

వెంకయ్య వైపే..
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వైపు రైతులు చూస్తున్నారు. ఉపరాష్ట్రపతి కాక ముందు ఆయన అమరావతి కోసం కృషి చేశారు. తాను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారు. అయితే.. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన ప్రత్యక్షంగా అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోయినా… పరోక్షంగా అయినా కేంద్ర పెద్దలతో మాట్లాడి, అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. మరి, వెంకయ్యనాయుడు ఏం చేస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్