Chiranjeevi Politics: తనకు రాజకీయాలు సూటుకావని చిరంజీవి పక్కకు తప్పుకున్నారు. ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. సోదరుడు పవన్ ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా ఏనాడు ఆ పార్టీ గురించి కానీ..తమ్ముడుకు మద్దతిస్తున్నట్టు ఏనాడు బాహటంగా చెప్పలేదు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు చిరంజీవి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాను రాజకీయాలకు దూరమయ్యేనా తప్ప.. తన నుంచి రాజకీయాలు దూరం కాలేదన్న సినిమా డైలాగు..ఈ అనుమానాలకు కారణం. చిరంజీవి జనసేనలోకి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని విశ్లేషణలు, కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ చిరంజీవి మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. కానీ అతడి చుట్టూ ఉన్నవారు మాత్రం ఆయన్ను పొలిటికల్ వింగ్ లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగా ఫ్యాన్స్, పూర్వశ్రమంలో పీఆర్పీలో పనిచేసిన వారు, కొందరు నిర్మాతలు ఈ జాబితాలో ఉన్నారు.

చిరు నటించిన గాడ్ ఫాదర్ ఇటీవల విడుదలై విజయం సాధించింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటుచేసింది. అయితే కార్యక్రమం అసాంతం చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ చుట్టే సాగింది. అందులో భాగంగా ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన వచ్చింది. అప్పట్లో ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేయడంపై పెద్ద దుమారమే నడిచింది.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఏపీని అధోగతి చేసి.. ఏంటీ గర్జనలు? వైసీపీకి పవన్ దిమ్మదిరిగే కౌంటర్
పార్టీని అమ్ముకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే అటువంటిదేమీ లేదని.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అప్పుల్లోఉండేదని.. వాటిని తీర్చేందుకు చిరు చెన్నైలోని విలువైన ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయితే చిరు మంచితనంకోసం చెప్పేందుకు ఎన్వీ ప్రసాద్ ఆ వ్యాఖ్యలు చేసుండొచ్చు కానీ.. నాటి ప్రస్తావనలు తేవడం మాత్రం అసందర్భం.

అయితే అంతటితో ఆగకుండా ప్రజారాజ్యం నుంచి వచ్చిన ఆవేశం, ఆలోచనగా జనసేనను అభివర్ణించారు. అంటే పీఆర్పీకి జనసేన ఉప పార్టీగా చెప్పుకొచ్చారు. జనసేనకు చిరంజీవి సపోర్టు ఎప్పుడూ ఉంటుందని భావం వచ్చేలా మాట్లాడారు. అయితే ఒకటి ఆలోచించాలి. చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్న చిరంజీవి ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. చుట్టూ ఉన్న వాళ్లే పొలిటికల్ గా రీఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. అటు గాడ్ ఫాదర్ లో డైలాగు వచ్చిందో లేదో అప్పుడే ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవిని కలిశారు. ఇది చర్చనీయాంశమైంది. పైకి సినిమా సక్సెస్ అయినందుకు అభినందించడానికే వచ్చానని గంటా చెబుతున్నా.. దాని వెనుక రాజకీయకారణాలున్నాయన్న అనుమానాలైతే ఉన్నాయి. అయితే చిరంజీవికి సంబంధం లేకున్నా, వద్దని చెబుతున్నా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు మాత్రం జరగుతున్నాయి.
Also Read:Nayanthara: గర్భం దాల్చకుండా నయనతార తల్లి ఎలా అయ్యింది?… అదో వ్యాపారం!
[…] Also Read: Chiranjeevi Politics: చిరు వద్దంటున్నా లాగే ప్రయత్… […]
[…] Also Read: Chiranjeevi Politics: చిరు వద్దంటున్నా లాగే ప్రయత్… […]