Chalaki Chanti Elimination: బిగ్ బాస్ షోపై ఎప్పటి నుండో చాలా అనుమానాలున్నాయి. ఈ షోకి ఎలాంటి ఖచ్చితమైన నిబంధనలు ఉండవు. బిగ్ బాస్ దే తుది నిర్ణయం. పరిస్థితుల ఆధారంగా రూల్స్, రెగ్యులేషన్స్ మార్చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే ఈ సీజన్లో భార్యాభర్తలుగా ఎంట్రీ ఇచ్చిన మెరీనా-రోహిత్ లను ఒక కంటెస్టెంట్ గా హౌస్లోకి పంపారు. జంటగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదని విడివిడిగా ఆడాలని ఆదేశించాడు. ఇక ఎలిమినేషన్స్ విషయంలో అయితే పూర్తిగా బిగ్ బాస్ దే నిర్ణయం అనిపిస్తుంది. ఆడినా ఆడకపోయినా టాప్ సెలబ్రిటీలు ఎలిమినేట్ కారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా షాకింగ్ ఎలిమినేషన్స్ ఉంటాయి.

ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయనేది ఆడియన్స్ కి తెలియదు. దానికి ఒక ప్రామాణికం లేదు. ఆ ఓట్ల లెక్కలు మనకు చెప్పరు. ఈ సీజన్లో జరిగిన ఆరోహిరావు, చంటి ఎలిమినేషన్ బిగ్ బాస్ నిర్వాహకుల నిర్ణయమే అని చాలా మంది అభిప్రాయం. ముఖ్యంగా చలాకీ చంటిని కావాలనే బయటికి పంపేశారనే వాదన నడుస్తుంది. ఎందుకంటే… టాప్ సెలెబ్రిటీలలో ఒకరిగా చలాకీ చంటి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెర స్టార్ గా ఆయనకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది.
బుల్లితెర షోస్ తో పాటు జబర్దస్త్ స్కిట్స్ లో చంటి ఎనర్జీ ఓ లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలో హౌస్లో ఆయన చెలరేగిపోతాడని అందరూ భావించారు. దానికి పూర్తి విరుద్ధంగా చలాకీ చంటి గేమ్ సాగింది. షోకి ఏమాత్రం అతడు ఫిట్ కాదని తేలిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడడం అంటే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. చిన్న విషయాలను పెద్దది చేసి గొడవలు పెట్టుకోవాలి. లేదా ఒక అందమైన అమ్మాయిని చూసి ఎఫైర్ పెట్టుకోవాలి.

ఇవేమీ చలాకీ చంటి చేయడం లేదు. ఆయన తన గేమ్ తాను ఆడుకోవడం పైనే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా కాంట్రవర్సీకి దూరంగా ఉంటున్నాడు. అదే సమయంలో షో పట్ల ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. ఇక నేను హౌస్లో ప్లాప్ అని నాగార్జునకు నేరుగా చెప్పాడు. చలాకీ చంటిని ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారనేది నిజం. చంటిని ఎలిమినేట్ చేస్తే ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వస్తుందని, అతనితో ప్లాప్ అని చెప్పించారు. ఈ ఎలిమినేషన్ విషయమై నిర్వాహకులకు చంటికి మధ్య డీల్ కూడా జరిగి ఉండవచ్చు.
[…] […]