https://oktelugu.com/

Allagadda: ఆళ్లగడ్డకు కొత్త అభ్యర్థి.. భూమా అఖిలప్రియ కు షాకిచ్చిన బాబు

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావు రేవు లాంటివి. అందుకే ఎటువంటి మొహమాటలకు పోకుండా.. ప్రజా మద్దతు ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని నాయకత్వం బలంగా భావిస్తోంది. అందుకే ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ కు పక్కన పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం.

Written By: Dharma, Updated On : October 15, 2023 9:43 am
Allagadda

Allagadda

Follow us on

Allagadda: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియను పక్కన పెడతారా? ఆమె సర్వేలో వెనుకబడ్డారా? తీవ్ర వ్యతిరేకత ఉందా? అందుకే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూమా నాగిరెడ్డి దంపతుల అకాల మరణం తర్వాత అనూహ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గూటికి చేరిన అఖిల ప్రియ మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డలో ప్రభావం చాటుకుంటూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆమెకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావు రేవు లాంటివి. అందుకే ఎటువంటి మొహమాటలకు పోకుండా.. ప్రజా మద్దతు ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని నాయకత్వం బలంగా భావిస్తోంది. అందుకే ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ కు పక్కన పెట్టేందుకు దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. వివిధ సంస్థల సర్వేల్లో అఖిలప్రియకు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు తేలింది. హై కమాండ్ కు సైతం అదే రకమైన నివేదికలు అందాయి. దీంతో నాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. బిజెపి ఇన్చార్జిగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియకు సమీప బంధువు. ఆయన అయితే వైసిపి ని దీటుగా ఎదుర్కొనగలరని భావిస్తున్నట్లు సమాచారం. అఖిల ప్రియ తీరు నచ్చక భూమా అభిమానులంతా కిషోర్ రెడ్డి వెంట నడుస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయనను టిడిపిలోకి రప్పించి టికెట్ ఇస్తే విజయం ఖాయమని హై కమాండ్ కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న కిషోర్ రెడ్డి సైతం టిడిపి నాయకత్వానికి టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాయలసీమ టిడిపి వ్యవహారాలను బీద రవిచంద్ర చూస్తున్నారు. ఇటీవల రవిచంద్రను హైదరాబాదులో కిషోర్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. టిడిపి నాయకత్వంతో నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో పార్టీలో చేర్చి ఇన్చార్జి బాధ్యతలను కిషోర్ రెడ్డికి అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అఖిలప్రియను కనీస పరిగణలోకి తీసుకోకుండా కిషోర్ రెడ్డికి పార్టీలో చేర్పించడానికి కొందరు నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మరోవైపు అఖిలప్రియ రామచంద్ర యాదవ్ స్థాపించిన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తామన్నా అక్కడ దారులు మూసుకుపోయాయి. టిడిపి చూస్తే పరిస్థితి ఇలా ఉంది. జనసేనలో చేరిన పొత్తులో భాగంగా సీటు దక్కడం కష్టమే. అందుకే అఖిలప్రియకు వేరే ఆప్షన్ లేదని.. తప్పకుండా టిడిపిలోనే కొనసాగుతారని.. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక ఇతరత్రా అవకాశాలు పరిశీలిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే భూమా అఖిలప్రియ ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. రాజకీయ భవిష్యత్తును చేజేతులా పోగొట్టుకున్నారు.