https://oktelugu.com/

ఆనందయ్యను తెగ వాడేసుకున్నారు

ఆయుర్వేదం మందుతో ఆనందయ్య పాపులర్ అయిపోయారు. ఆయన పేరు వాడుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. సంస్థలు,వ్యక్తులు ఆయన పేరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గల్లీ లీడర్లు సైతం శాలువా, దండ తీసుకుని ఆనందయ్యకు ఇచ్చేసి హడావిడి చేసి ఫొటోలు దిగి ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు. ఆనందయ్య మందు తయారీకి ఆయన అడగకపోయినా సరుకులిస్తామంటూ దాతలు క్యూ కడుతున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, ఇతర సామగ్రి అందజేస్తూ ఫొటోలు దిగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగాఓ సంస్థ ఆయనకు డాక్టరేట్ ఇచ్చేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 07:18 PM IST
    Follow us on

    ఆయుర్వేదం మందుతో ఆనందయ్య పాపులర్ అయిపోయారు. ఆయన పేరు వాడుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. సంస్థలు,వ్యక్తులు ఆయన పేరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గల్లీ లీడర్లు సైతం శాలువా, దండ తీసుకుని ఆనందయ్యకు ఇచ్చేసి హడావిడి చేసి ఫొటోలు దిగి ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు.

    ఆనందయ్య మందు తయారీకి ఆయన అడగకపోయినా సరుకులిస్తామంటూ దాతలు క్యూ కడుతున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, ఇతర సామగ్రి అందజేస్తూ ఫొటోలు దిగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగాఓ సంస్థ ఆయనకు డాక్టరేట్ ఇచ్చేసింది. ఈ డాక్టరేట్ ని ఆనందయ్య ఏం చేసుకుంటారో తెలియదు కానీ, ఇప్పుడిదో సెన్సేషన్ అయింది.

    కులసంఘాల హడావిడి చెప్పనక్కరలేదు. ఆనందయ్య మావాడే అంటే మా వాడంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకోవడం చూస్తుంటే ఆనందయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆనందయ్య పేరుకు ఫొటోకి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆనందయ్య మందుపై తమ ఫొటోలు ముద్రించుకోవడానికి పోటీ పడుతున్నారు.

    ఆనందయ్య పేరును సోషల్ మీడియా కూడా బాగానే వాడుకుంది. ఆ పేరుతో గూగుల్ లో సెర్చ్ చేస్తే వేలాది వీడియోలు, కథనాలు కనబడుతున్నాయి.అందులో అసలు విషయం కంటే కల్పితమే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఆనందయ్య పేరు వాడుకున్నోళ్లకి వాడుకున్నంతగా తయారైంది.