కేసీఆర్ బాణం: హరీష్ ఎందుకు యాక్టివ్ అయ్యారు?

తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బయటకు పంపాక.. నెక్ట్స్ హరీష్ రావుయే నని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈటలకు, హరీష్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరూ కూడా జట్టుగా పనిచేశారు. కానీ అనూహ్యంగా ఈటల వైదొలగడం.. హరీష్ రావుకు కూడా కేసీఆర్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని బాంబు పేల్చడం జరిగిపోయింది. కానీ ఈటల ఆరోపణలను ఖండించిన హరీష్ రావు.. తన జీవితం కేసీఆర్ కు అంకితం అని […]

Written By: NARESH, Updated On : June 11, 2021 10:08 am
Follow us on

తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బయటకు పంపాక.. నెక్ట్స్ హరీష్ రావుయే నని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈటలకు, హరీష్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరూ కూడా జట్టుగా పనిచేశారు. కానీ అనూహ్యంగా ఈటల వైదొలగడం.. హరీష్ రావుకు కూడా కేసీఆర్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని బాంబు పేల్చడం జరిగిపోయింది. కానీ ఈటల ఆరోపణలను ఖండించిన హరీష్ రావు.. తన జీవితం కేసీఆర్ కు అంకితం అని సెలవిచ్చాడు.

అయితే ఈటల తర్వాత ఎగ్జిట్ అయ్యేది హరీష్ రావుయేనన్న ఊహాగానాలకు తెరదించుతూ హరీష్ ను తెలంగాణ పాలనా వ్యవహారాల్లో అనూహ్యాంగా యాక్టివ్ చేసేశాడు సీఎం కేసీఆర్.

ఇప్పటికే ఆర్థిక శాఖను చూస్తున్న హరీష్ రావుకు ఇప్పుడు తన పరిధిలోని వైద్యఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. అంతేకాదు.. తాజాగా హరీష్ కు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఖాళీలు లెక్కతేల్చి భర్తీ చేసే బాధ్యతను అప్పజెప్పారట..ఈ మేరకు హరీష్ రావు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ వీటన్నింటని చూసుకుంటున్నారు.

హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నా కూడా సిద్దిపేటలోనే ఎక్కువ రోజులు ఉండేవారు. కానీ ఇప్పుడు సిద్దిపేటకు పోకుండా తెలంగాణ పాలన వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అల్లుడు హరీష్ ను ప్రభుత్వంలో కీరోల్ లోకి మార్చి కేసీఆర్ విమర్శలకు చెక్ చెబుతున్నారు. ఈటల వెంట హరీష్ పోకుండా కాపాడేందుకా? లేక అల్లుడిని బుజ్జగించేందుకు ఇలా కేసీఆర్ చేస్తున్నాడా? అని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.