Homeజాతీయ వార్తలుAjit Doval viral news: ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌.. ఫోన్‌ వాడరు.. ఇంటర్నెట్‌ టచ్‌ చేయరు.....

Ajit Doval viral news: ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌.. ఫోన్‌ వాడరు.. ఇంటర్నెట్‌ టచ్‌ చేయరు.. షాకింగ్సీ సీక్రెట్స్‌ ఇవే!

Ajit Doval viral news: జేమ్స్‌ బాండ్‌ అనగానే సినిమాల్లోని సీక్రెట్‌ ఏజెంట్స్‌ గుర్తొస్తారు. ఎక్కువగా ఇంగ్లిష్‌ సినిమాల్లోనే బాండ్‌ సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. అయితన మర రియల్‌ జేమ్స్‌ బాండ్‌ గురించి చాలా మందికి తెలియదు. పాక్‌ బిచ్చగాడిగా అణు రహస్యాలు బయటపెట్టాడు. అక్కడి రహస్యాలు తెలుసుకుని వచ్చాడు. అతనే భారత భద్రతా గార్డియన్‌ అజిత్‌ దోవల్‌.. ప్రపంచాన్ని ముంచెత్తిన ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌! పాకిస్థాన్‌ వీథుల్లో ముసుగు, దుప్పటి ధరించి ఆరేళ్లు అక్కడే ఉండి.. అణు ఆయుధ రహస్యాలు తెలుసుకున్నాడు. ఆ ధైర్యసాహసాలు ఇప్పటికీ ఆయనను హీరోగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు.. ఆయన ఫోన్‌ వాడడం లేదు. సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ జోలికి వెళ్లడం లేదు.

రహస్య జీవితం..
జనవరి 10 వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌లో దోవల్‌ బాంబ్‌ డ్రాప్‌ చేశారు: ’నేను ఫోన్, ఇంటర్నెట్‌ అస్సలు వాడను!’ అవసరమే అయితే కుటుంబం, విదేశీయులతో మాట్లాడటానికి పరిమితంగా తీసుకుంటాను. రోజులంతా ఇవి లేకుండా పనులు చేస్తాను. ‘కమ్యూనికేషన్‌ మార్గాలు అనేకం.. ప్రజలకు తెలియని సూపర్‌ సీక్రెట్‌ టెక్నాలజీలు ఉన్నాయి!’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌ అయ్యాయి.

కీర్తి చక్ర హీరో!
1945 ఉత్తరాఖండ్‌లో పుటిన ధోవల్‌.. 1968 ఐపీఎస్‌ అయ్యారు. కీర్తి చక్ర గెలిచిన అతి పిన్న పొలీసు యోధుడు! మిజోరం, పంజాబ్‌ తిరుగుబాట్లను అణచివేశాడు. కేరళ క్యాడర్‌లో రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో రహస్య యుద్ధాలు గెలిచాడు. భద్రతా నిర్ణయాల్లో లెజెండరీ ఫైటర్‌!

1999 కాందహార్‌ IC–814 హైజాక్‌లో చర్చలు చేసి ప్రయాణికుల్ని హైజాకర్ల ఆస్పతాలి నుంచి బయటపెట్టాడు. 15 హైజాక్‌ కేసులు విజయ ఘనత, 2016 సర్జికల్‌ స్ట్రైక్, 2019 బాలాకోట్‌ దాడుల్లో రహస్య ప్లాన్లు రూపొందించాడు. ఇప్పుడు ప్రధాని మోదీకి ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version