https://oktelugu.com/

Kanguva: విడుదలకు ముందే కంగువాను దెబ్బతీశారు, ఇదిగో ప్రూఫ్!

కంగువా మూవీ భారీ చిత్రాలకు భిన్నంగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. విడుదలకు ముందే ఆ మూవీకి దెబ్బపడింది. ఆడియన్స్ దూరం పెట్టారు. అందుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు.

Written By: S Reddy, Updated On : November 16, 2024 2:25 pm
Kanguva Collection

Kanguva Collection

Follow us on

Kanguva: కంగువా చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాడు సూర్య. బలమైన కథతో పాటు, కొత్తదనం ఉండటంతో ఆయన నమ్మి చేశాడు. అందులోనూ దర్శకుడు శివకు తమిళంలో భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మాస్ హీరోలను ఆయన బాగా డీల్ చేస్తాడు. కంగువా విషయంలో ఆయన బోల్తాపడ్డాడు. కథ కొత్తగా ఉన్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో శివ ఫెయిల్ అయ్యాడని తెలుస్తోంది. ఫస్ట్ షో నుండే కంగువా చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే మూవీ నిరాశపరిచిందని అంటున్నారు.

అయితే కంగువా చిత్రానికి విడుదలకు ముందే డ్యామేజ్ జరిగింది. అది భారీగా ఆ చిత్ర వసూళ్లను దెబ్బ తీసింది. సూర్యకు తమిళ్ తో పాటు తెలుగులో భారీ ఫేమ్ ఉంది. ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతుంది. ఆయనకు ఇక్కడ ఫ్యాన్ బేస్, అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. కంగువా వంటి ఓ భారీ బడ్జెట్, పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనగానే సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ అది ఓపెనింగ్స్ లో కనిపించలేదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఓపెనింగ్స్ బాగుంటాయి. బ్యాడ్ టాక్ వస్తే నెక్స్ట్ డే నుండో లేదంటే వీకెండ్ తర్వాతో కలెక్షన్స్ పడిపోతాయి. విచిత్రంగా కంగువా చిత్రానికి ఓపెనింగ్స్ కూడా రాలేదు. అంటే కంగువా బ్యాడ్ మూవీ అని విడుదలకు ముందే ఆడియన్స్ అభిప్రాయానికి వచ్చినట్లు అయ్యింది. తెలుగులో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాల ఫలితాలు, రిజల్ట్స్ పరిశీలిస్తే.. అవన్నీ ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటాయి.

పెద్ద సినిమా అనగానే ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారు. కంగువాకు అలా అడ్వాన్స్ బుకింగ్స్ దక్కలేదు. అటు తమిళంలో కూడా ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభాస్ ప్లాప్ చిత్రాలైన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ పెద్ద మొత్తంలో ఓపినింగ్స్ రాబట్టాయి. నెగిటివ్ టాక్ నేపథ్యంలో అనంతరం వసూళ్లు తగ్గాయి.

మొత్తంగా సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువా సైతం నిరాశపరిచింది. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన సూర్యకు పదేళ్ల నుండి కమర్షియల్ హిట్ లేకుండా పోయింది. ఆ మధ్య విడుదలైన సూరారై పోట్రు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆ చిత్రాన్ని నేరుగా ప్రైమ్ లో విడుదల చేశారు. మరి నెక్స్ట్ మూవీతో అయినా సూర్య కమ్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.