AP Weather Alert:ఏపీ( Andhra Pradesh) ప్రజలకు బిగ్ అలెర్ట్. బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. చైనా హాంకాంగ్ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తుఫాన్ కారణంగా రాబోయే మూడు రోజులపాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో ప్రళయం సృష్టించింది. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తుఫాను గారు రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు?
మూడు రోజులపాటు వర్షాలు..
అయితే అది క్రమేపి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు( Alluri sitaramaraj ), కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రైతులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో ఏడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది.
ఆ దేశాలను వణికించిన తుఫాన్
మరోవైపు చైనా( China), హాంకాంగ్ ప్రాంతాల్లో తుఫాను విలయతాండవం సృష్టించింది. తుఫాన్ దాటికి అక్కడ వందలాది భవనాలు వంశమయ్యాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచ్చాయి. హాంకాంగ్ కు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు నాలుగు వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. దక్షిణ కొరియాలో సైతం బీభత్సం సృష్టించింది తూఫాన్. అక్కడ 17 మంది మృత్యువాత చెందారు. భారీ వర్షాలు కారణంగా 400 భవనాలు దెబ్బతిన్నాయి. పిలిపిన్స్ లో తుఫాన్ విలయతాండవం సృష్టించింది. దాదాపు నాలుగు లక్షల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ తుఫాన్ మూలాలు బంగాళాఖాతంలో ప్రవేశించడం.. అల్పపీడనం క్రమేపి బలపడడంతో ఏపీకిసైతం భారీ వర్ష సూచన ఉంది.