PM Modi America Visit: నాడు సాధారణ పౌరుడు.. ఇప్పుడు అమెరికా అతిథి.. మోడీ ఎంత ఎదిగాడు..?

ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కంటే ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగాను మోదీ వ్యవహరించారు. 1994లో అంటే సరిగ్గా 29 ఏళ్ల కిందట కేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు.

Written By: BS, Updated On : June 22, 2023 12:17 pm

PM Modi America Visit

Follow us on

PM Modi America Visit: ‘మన ఎదుగుదల ఎలా ఉండాలంటే.. ఒకప్పుడు మనతో మాట్లాడేందుకు ఇష్టపడని వాడు కూడా మన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా ఉండాలి’ ఇది ఒక సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ ప్రధాన నరేంద్ర మోడీకి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు మోడీ సిద్ధపడగా అమెరికా ఇందుకు అనుమతి ఇవ్వలేదు. అంతకు ముందు 1994లో ఒక సాధారణ టూరిస్ట్ గా అమెరికా పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోడీ వైట్ హౌస్ ముందు ఫోటో దిగారు. అయితే, ఇప్పుడు అదే నరేంద్ర మోడీ భారత దేశ ప్రధానిగా అమెరికాలో పర్యటిస్తుండగా వైట్ హౌస్ ఆయనకు ఆతిథ్యాన్నిస్తోంది. ఈ పర్యటనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

నరేంద్ర మోడీ.. భారతదేశానికి ప్రధానులుగా పని చేసిన వారిలో అతి కొద్ది మందికి మాత్రమే లభించిన, దక్కిన అరుదైన గౌరవాలు ఈయనకు మాత్రమే లభిస్తున్నాయి. ప్రపంచ దేశాలు మోడీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏ దేశానికి మోడీ వెళ్లిన అక్కడి భారతీయులతోపాటు ఆయా దేశాల పాలకులు, అగ్ర నాయకులు అఖండ స్వాగతాన్ని పలుకుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ కూడా విదేశాంగ విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పక్కలో బల్లెంలా చైనా, పాకిస్తాన్ దేశాలు వీలు చిక్కినప్పుడల్లా భారతదేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీరికి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి అవసరమైన సందర్భాల్లో మద్దతును పొందేందుకు అనుగుణంగా అనేక దేశాలతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు మోడీ. అందులో భాగంగానే 2019లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచ దేశాల పర్యటనకు మోడీ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే అనేక దేశాలను ప్రధాన మోడీ సందర్శించి.. ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం అవుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు సంబంధించిన రెండు విభిన్నమైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన చర్చకు కారణమవుతున్నాయి.

టూరిస్ట్ గా వైట్ హౌస్ ముందు ఫోటో దిగిన మోడీ..

ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కంటే ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగాను మోదీ వ్యవహరించారు. 1994లో అంటే సరిగ్గా 29 ఏళ్ల కిందట కేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. సాధారణ టూరిస్ట్ గా అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ వైట్ హౌస్ చూసేందుకు వెళ్లారు. ప్రధాన నరేంద్ర మోడీతోపాటు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా నాటి మోడీ పర్యటనలో ఉన్నారు. సాధారణ టూరిస్టులుగా ఆ పర్యటనకు వెళ్లిన మోడీతోపాటు ఇతర స్నేహితులు కూడా వైట్ హౌస్ ముందు ఫోటో దిగారు. ఆ ఫోటోలో కుర్తా ధరించి చేతిలో బ్యాగు పట్టుకుని నిలబడి ఉన్నారు నరేంద్ర మోడీ. పక్కన కిషన్ రెడ్డితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీకి స్పందించిన మరో ఫోటో కూడా వైరల్ అవుతుంది. ప్రత్యేక విమానంలో అమెరికాలో ల్యాండ్ అయిన నరేంద్ర మోడీ రెండు చేతులు నమస్కరిస్తూ విమానం దిగుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

విజయం అంటే ఇదే కదా అంటూ షేరింగ్..

ఈ రెండు ఫోటోలను ఒకే చోట పెడుతూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. విజయం అంటే ఇదే కదా అంటూ ఈ ఫోటోలు కింద క్యాప్షన్ పెడుతున్నారు. నిజమే నరేంద్ర మోడీ సాధించిన విజయం అనన్య సామాన్యమైనది. సాధారణ కుటుంబంలో జన్మించిన మోడీ అసాధారణ స్థాయికి చేరుకున్నారు. టీ అమ్ముకున్న వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రి కావడమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత బలమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇటువంటి గుర్తింపు అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఒకప్పుడు భారతదేశాన్ని చులకనగా చూసిన ఎంతోమంది.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అద్వితీయమైన శక్తిగా ఎదుగుతున్న తీరును చూసి ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యం చెందుతున్నాయి. ఇక మోడీ నాయకత్వ ప్రతిభ, దేశాన్ని తీర్చిదిద్దుతున్న వైనం అగ్ర దేశాలకు కూడా కంటగింపుగా మారింది అంటే ఏ స్థాయిలో భారతదేశం ముందుకు ప్రయాణం సాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మోడీ సాధించిన విజయం అనన్య సామాన్యమైనది. అతి కొద్ది మంది మాత్రమే ఇటువంటి విజయాలను దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.