వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ బిల్లులు రైతులను నష్టపరచనున్నాయా..? తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ చెప్పినట్లుగా డిస్కంల మీద రాష్ట్రాల అజమాయిషీ పోనుందా..? ఉచిత విద్యుత్‌ హామీని మరిచిపోవాల్సి వస్తుందా..? అసలు ఈ వ్యవసాయ బిల్లు వెనుక నడుస్తున్న కథ ఏంటి..?ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఈ బిల్లులు కార్పొరేట్‌ వ్యవస్థలకు దాసోహం కానున్నాయా..? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. Also Read: దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం? కేంద్ర వ్యవసాయ శాఖ […]

Written By: NARESH, Updated On : September 22, 2020 3:58 pm

Agricultural bill

Follow us on

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ బిల్లులు రైతులను నష్టపరచనున్నాయా..? తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ చెప్పినట్లుగా డిస్కంల మీద రాష్ట్రాల అజమాయిషీ పోనుందా..? ఉచిత విద్యుత్‌ హామీని మరిచిపోవాల్సి వస్తుందా..? అసలు ఈ వ్యవసాయ బిల్లు వెనుక నడుస్తున్న కథ ఏంటి..?ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ఈ బిల్లులు కార్పొరేట్‌ వ్యవస్థలకు దాసోహం కానున్నాయా..? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి.

Also Read: దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌‌ ఆదివారం ఉదయం వ్యవసాయ సంబంధ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులు చరిత్రాత్మకమైనవి పేర్కొన్నారు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ బిల్లులు ఎంతగానో దోహదపడుతాయని చెప్పుకొచ్చారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చని తెలిపారు.

కానీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లులను పూర్తిగా విమర్శిస్తున్నాయి. ఈ బిల్లును విమర్శిస్తూనే ఎన్డీయేలోని ఓ భాగస్వామి అయిన కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా కూడా చేశారు. తాజాగా.. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ కూడా సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులు రైతులకు ఉరితాళ్లు బిగిస్తాయంటూ మండిపడుతోంది.

Also Read: పార్లమెంట్ సాక్షిగా రాత్రంతా కదంతొక్కిన ఎంపీలు

ఈ బిల్లులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ 3 వ్యవసాయ బిల్లులతో ప్రధానంగా కార్పొరేట్లకే ప్రయోజనం కలుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్కుమార్‌‌ రెడ్డి అంటున్నారు.మార్కెట్‌ కమిటీల వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పారు. అందుకే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదానీలు, అంబానీలు, అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చి.. రైతులను నష్టపరిచేలా బిల్లులు ఉన్నాయని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నిత్యవసరాల సవరణ బిల్లు పెట్టామని చెబుతున్నారని, అది ఎలా సాధ్యమో చెప్పలేదన్నారు. ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక బిల్లులపై టీఆర్‌ఎస్‌ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. లోక్‌సభలో బిల్లులు పెట్టినప్పుడు మెదలకుండా కూర్చున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను గమనించి రాజ్యసభలో వ్యతిరేకించే ప్రయత్నం చేశారని విమర్శించారు.