
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. చీరాల దళిత యువకుడి కేసులో ప్రభుత్వాన్ని కోర్టు పలు రకాలు ప్రశ్నించింది. మాస్క్ లేదని చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను ఎస్‌ఐ కొట్టడంతో మరణించిన కేసు మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కిరణ్‌కుమార్ తరుపున మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ వేయగా జాడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. అయితే విచారణ పట్ల కిరణ్‌కుమార్ తల్లిద్డంఉలు సంతృప్తి చెందారని కేసు కోట్టివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కానీ ఈ కేసు సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదని, ఆ సంస్థ విచారించడానికి అర్హత ఉందని తెలిపింది. దీంతో పూర్తి వివరాలకు రెండు వారాలు గడువు కావాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
Also Read: సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ