https://oktelugu.com/

మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్న జగన్ సర్కార్…!

జగన్ 3 రాజధానుల కల ఇప్పుడిప్పుడే నెరవేరేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత కొద్ది నెలల నుండి ప్రధాన ప్రతిపక్షంగా తయారయి షాకుల మీద షాకులు ఇస్తున్న హైకోర్టు…. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా మూడు రాజధానుల పై స్టే విధించిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ విడుదల చేసిన గజెట్ నోటిఫికేషన్ మీద స్టేటస్ క్యువో జారీచేసిన హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 7, 2020 8:09 pm
    Follow us on

    జగన్ 3 రాజధానుల కల ఇప్పుడిప్పుడే నెరవేరేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత కొద్ది నెలల నుండి ప్రధాన ప్రతిపక్షంగా తయారయి షాకుల మీద షాకులు ఇస్తున్న హైకోర్టు…. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా మూడు రాజధానుల పై స్టే విధించిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ విడుదల చేసిన గజెట్ నోటిఫికేషన్ మీద స్టేటస్ క్యువో జారీచేసిన హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక వివరాల్లోకి వెళితే.. 3 రాజధానులకు మద్దతుగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరియు సిఆర్డిఎ చట్టం రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా కష్టపడింది. ఇక గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత అమరావతి నుండి విశాఖపట్నానికి రాజధానిని తరలించడం…. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో వారికి పెద్ద షాక్ తగిలి…. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈ విషయమై తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధం అని…. తాము సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి తమ మూడు రాజధానులు బిల్లును ఆమోదింపజేసుకుంటామని ఛాలెంజ్ విసిరారు.

    ప్రస్తుతానికి అయితే చంద్రబాబు చాలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని…. అలాగే అమరావతిని తన సొంత అవసరాల కోసం రాజధానిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని నాని అన్నారు. ఇక అమరావతి ఉద్యమం అనేది రాజకీయంగా రగిల్చిన ఒక బూటకం అని,.. చంద్రబాబు కేవలం అతని అవసరాల కోసమే దీనిని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇక నాని అన్న మాటలు చూస్తుంటే త్వరలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కనున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సుప్రీంకోర్టు…. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చింది. మరి అత్యున్నత ధర్మస్థానం మూడు రాజధానుల బిల్లుకి మద్దతు తెలుపుతుందా లేదా అమరావతి రైతుల వైపు మాట్లాడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.