https://oktelugu.com/

అలా లేకుంటే నన్నెవరూ ఆదరించరు: శ్రీదేవి కూతురు

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తన కెరీర్ను మలుపు తిప్పే విజయం కోసం ఆశిస్తోంది. తాను పైలట్‌గా నటించిన ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ మూవీపై ఆమె గంపెడాశలు పెట్టుకుంది. కార్గిల్‌ వార్లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఈ నెలలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రిలీజ్‌ కాబోతోంది. కాగా, ఈ మూవీపై సోషల్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 / 08:46 PM IST
    Follow us on


    అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తన కెరీర్ను మలుపు తిప్పే విజయం కోసం ఆశిస్తోంది. తాను పైలట్‌గా నటించిన ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ మూవీపై ఆమె గంపెడాశలు పెట్టుకుంది. కార్గిల్‌ వార్లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఈ నెలలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రిలీజ్‌ కాబోతోంది. కాగా, ఈ మూవీపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది. అయితే, దీన్ని తాను పట్టించుకోవడం లేదని జాన్వీ అంటోంది. శ్రీదేవి, బోణీ కపూర్ కూతురుగా అందరికీ సుపరిచితం అయినప్పటికీ తాను ఎక్స్‌టార్డినరీగా ఉంటే తప్ప ప్రజలు తనను ఆదరించబోరని అంటోందామె. అందువల్ల తొందరగా సంతృప్తి పడనని, ఎక్కువ కష్టపడి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది.

    Also Read: తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

    ఇక, సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. స్టార్కిడ్‌ కావడంతో జాన్వీపై కూడా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. దీనిపై స్పందించిన జాన్వీ ప్రజల సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఒక నటిగా తన వృత్తిని సమర్థంగా నిర్వర్తిస్తానని, తద్వారా తన తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు చూపించిన ప్రజలకు తాను అదే ప్రేమను పంచాలని అనుకుంటున్నానని తెలిపింది. ‘నాకు ఈ అవకాశం తేలికగా లభించిందన్నది నిజం. కాబట్టి నన్ను నిరూపించుకోవడానికి నేను అదనంగా ఏదైనా చేయవలసి వస్తే, దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రేమను సంపాదించడం నాకు ఎంతో విలువైనది. ఎందుకంటే ప్రజలు నా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. అందువల్ల నేను వాళ్లకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. దాన్ని నేను ఇష్టపడే వృత్తి ద్వారా ఇవ్వడమే ఉత్తమమైన మార్గం’ అంటూ 23 ఏళ్ల జాన్వీ తన వయసుకు మించిన పరిణతితో చెప్పింది. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా. ఆమెలో ఈ క్లారిటీలో ఉంటే కచ్చితంగా తల్లి పేరు నిలబెట్టగలదు.