https://oktelugu.com/

కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

కారులో నేతల ఓవర్ లోడ్ నేడు పార్టీ అధిష్టానికి కొత్తనొప్పులను తీసుకొస్తుంది. కామారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య కార్చిచ్చు అంటుంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన నేతకు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి ఎడామొఖం పెడముఖంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వర్గపోరు మొదలైందనే ప్రచారం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 / 07:55 PM IST
    Follow us on


    కారులో నేతల ఓవర్ లోడ్ నేడు పార్టీ అధిష్టానికి కొత్తనొప్పులను తీసుకొస్తుంది. కామారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య కార్చిచ్చు అంటుంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన నేతకు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తొలి నుంచి ఎడామొఖం పెడముఖంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వర్గపోరు మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

    కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరికీ వారు నియోజకవర్గంలో తామ మాటే నెగ్గాలనే చూస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు రెండువర్గాలు విడిపోతున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా కార్యకర్తలు విడిపోవడం టీఆర్ఎస్ పెద్దలను కలవరానికి గురిచేస్తోందట. వీరువురి వర్గపోరు ప్రత్యర్థి పార్టీలు పుంజుకోవడానికి అవకాశం కల్పిస్తుంట. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీలు గట్టి పోటీ ఇవ్వడానికి నేతల మధ్య విబేధాలే కారణమని అదిష్టానం పెద్దలు భావిస్తున్నారట.

    ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ చేరిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలు చిలీపోయారట. ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్ లో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని పక్కనపెట్టి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ లోని సీనియర్ కార్యకర్తలు ఎమ్మెల్యే సురేందర్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారట. తమను మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రవేసి సభ్యత్వం నమోదులోనూ ప్రాధాన్యం ఇవ్వడంలేదని కనీసం టీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలువడం లేదని పలువురు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

    టీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య టీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతుందట. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలోని గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాల్లో టీఆర్‌ఎస్ రెండు విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు ఎవరికీ వారు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగేందుకు యత్నిస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు ఎవరివైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయట.

    Also Read: మధుయాష్కి మళ్లీ ఎంట్రీ ఇస్తారా? ఇవ్వరా?

    ఈ వ్యవహారం తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిండేంట్ కేటీఆర్ దగ్గరకు చేరడంతో ఇరువురి నేతలపై ఆయన సీరియస్ అయ్యారనే టాక్ విన్పిస్తోంది. అయితే ఈ నేతల్లో మార్పులేదని కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం ఎల్లారెడ్డిలో నెలకొన్న వర్గపోరుపై దృష్టిసారించకపోతే రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!