పదవిలో నిమ్మగడ్డ ఉండే ప్రసక్తి లేదంటున్న వైసిపి

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అర్ధాంతరంగా తొలగించడం చెల్లుబాటు కాదని అంటూ రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆయనను ఎట్టి పరిస్థితులలో ఆ పదవిలో కొనసాగించే ప్రసక్తి లేదని వైసిపి నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అయితే హైకోర్ట్ తీర్పుపై నేరుగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవ్వరు బైటకు మాట్లాడటం లేదు. కేవలం పార్టీ ప్రతినిధిగా అంబటి రాంబాబు తాము సుప్రీం కోర్ట్ లో సవాల్ చేస్తున్నట్లు ప్రకటించారు. […]

Written By: Neelambaram, Updated On : May 31, 2020 11:02 am
Follow us on


రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అర్ధాంతరంగా తొలగించడం చెల్లుబాటు కాదని అంటూ రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆయనను ఎట్టి పరిస్థితులలో ఆ పదవిలో కొనసాగించే ప్రసక్తి లేదని వైసిపి నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అయితే హైకోర్ట్ తీర్పుపై నేరుగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవ్వరు బైటకు మాట్లాడటం లేదు.

కేవలం పార్టీ ప్రతినిధిగా అంబటి రాంబాబు తాము సుప్రీం కోర్ట్ లో సవాల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విచిత్రంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి నిమ్మగడ్డను ఆ పదవి తిరిగి చేపట్టమని హై కోర్ట్ ఎక్కడ చెప్పలేదు గదా అంటూ మరో వివాదాన్ని లేవదీశారు.

కేవలం ఆయన్ను తిరిగి నియమించమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి పలు అనుమానాలు ఉండడంతో సుప్రీం కోర్ట్ కు వెడుతున్నామని చెప్పుకొచ్చారు. పైగా, తీర్పుపై స్టే కోరుతూ తాము వేసిన పిటీషన్ ఇంకా హైకోర్ట్ ముందుండగా రమేష్ కుమార్ ఏ విధంగా బాధ్యతలు చేబడతారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.

తనకు తానే నిమ్మగడ్డ ఎట్లా తిరిగి బాధ్యతలు చేబడతారు అంటూ లీగల్ పాయింట్ లేవదీశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ ను ఇంకా ఎన్నికల కమీషనర్ గా గుర్తించడం లేదని సంకేతం స్పష్టంగా ఇచ్చారు. నిమ్మగడ్డను నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించినట్లే, జస్టిస్ కనగ రాజ్ ను ఇప్పటి ప్రభుత్వం నియమించినదని చెప్పుకొచ్చారు. ఒకరి నియామకం చెల్లదంటే మరొకరి నియామకం కూడా చెల్లదని అంటూ శ్రీరామ్ స్పష్టం చేశారు.

అడ్వకేట్ జనరల్ న్యాయపరమైన అంశాలను కోర్ట్ ముందుంచాలి. లేదా ప్రభుత్వానికి సూచించాలి. కానీ మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు లేవనెత్తడం ఒక విచిత్ర సంప్రదాయానికి దారితీస్తుంది. ఏది ఏమైనా రమేష్ కుమార్ ను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పలు రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు శ్రీరామ్ సంకేతాలు ఇచ్చిన్నట్లు అయింది.