https://oktelugu.com/

Maruthi Cars: అదరగొట్టిన సేల్స్.. మళ్లీ అవే మారుతి కార్లు టాప్ 3లోకి..

మారుతి నుంచి ది బెస్ట్ గా నిలిచిన కార్లలో స్విప్ట్, వ్యాగన్ ఆర్ ఉన్నాయి. వీటితో పాటు డిజైర్ కూడా అత్యధిక సేల్స్ అందుకుంటోంది. తాజాగా తేలిన లెక్కల ప్రకారం మరోసారి ఈ మూడు కార్లే అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 14, 2024 / 01:22 PM IST

    Maruthi suzuki cars

    Follow us on

    Maruthi Cars: దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది మారుతి సుజుకీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి.మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినా మారుతికి చెందిన కొన్ని కార్లను బీట్ చేయలేకపోతున్నాయి. మారుతి నుంచి ది బెస్ట్ గా నిలిచిన కార్లలో స్విప్ట్, వ్యాగన్ ఆర్ ఉన్నాయి. వీటితో పాటు డిజైర్ కూడా అత్యధిక సేల్స్ అందుకుంటోంది. తాజాగా తేలిన లెక్కల ప్రకారం మరోసారి ఈ మూడు కార్లే అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి నుంచి విడుదలయిన స్విప్ట్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. దశాబ్దాలుగా తగ్గకుండా సేల్స్ నమోదు చేసుకుంటున్న స్విప్ట్ ఇటీవల అప్డేట్ వెర్షన్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే పాత స్విప్ట్ పై వినియోగదారుల మనసు వీడడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన గణాంకాల ప్రకారం 2024 మే నెలలో హ్యాచ్ బ్యాక్ స్విప్ట్ ను 19,393 మంది కొనుగోలు చేశారు. గతేడాది ఇదే నెలలో 17,346 మంది కొనుగోలు చేశారు.

    మరో బెస్ట్ మోడల్ డిజైర్ సైతం బెస్ట్ సేల్స్ ను నమోదు చేసుకుంది. ఈ మోడల్ 2024 మే నెలలో 16,061 యూనిట్ల విక్రయం జరగగా.. గత ఏడాది మే లో 11,315 కార్లు విక్రయించారు. డిజైర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తూ 89 బీహెచ్ పీ పవర్ తో మూవ్ అవుతుంది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఎంపిక కూడా ఉంది.

    మారుతి కార్లలో స్విప్ట్ తరువాత వ్యాగన్ ఆర్ బెస్ట్ కారుగా నిలుస్తుంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్సన్ కూడా ఉంది. ఈ మోడల్ ను 2024 మే నెలలో 14,492 యూనిట్లు విక్రయాలు జరిగాయి. 2023 మే నెలలో 16,258 జరిగాయి. గతేడాది కంటే వార్షక స్థాయిలో క్షీణత నమోదైనా.. ప్రస్తుత అమ్మకాల్లో టాప్ 3లో నిలిచింది.