https://oktelugu.com/

ఉద్ధవ్ థాక్రే ఎన్నికకు రంగం సిద్ధం!

ఏ సభలో సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే శాసన మండలికి ఎన్నిక కావడానికి అడుగడుగునా ఎదురవుతున్న అడ్డంకులు చివరకు తొలగిన్నట్లు అయింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి రంగం సిద్దమైనది. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ లో మండలికి జరుగవలసిన ఎన్నికలను ఎన్నికల కమీషన్ వాయిదా వేయడంతో, గవర్నర్ కోటా కింద మండలికి నామినేట్ చేయించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికి రెండు సార్లు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై గవర్నర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 12:28 PM IST
    Follow us on

    ఏ సభలో సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే శాసన మండలికి ఎన్నిక కావడానికి అడుగడుగునా ఎదురవుతున్న అడ్డంకులు చివరకు తొలగిన్నట్లు అయింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి రంగం సిద్దమైనది.

    లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ లో మండలికి జరుగవలసిన ఎన్నికలను ఎన్నికల కమీషన్ వాయిదా వేయడంతో, గవర్నర్ కోటా కింద మండలికి నామినేట్ చేయించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికి రెండు సార్లు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై గవర్నర్ మౌనంగా ఉంటూ ఉండడంతో శివసేన వర్గాలలో ఆందోళన చెలరేగింది.

    అంతలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యాన్ని స్వయంగా ఉద్ధవ్ థాక్రే కోరడంతో, వాయిదా పడిన ఎన్నికలను మే 21న జరపడానికి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ను ప్రకటించింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా వాయిదా పడిన ఎన్నికలను జరుపకుండా ఇక్కడనే జరుపుతూ ఉండడం గమనార్హం. దానితో శివసేన నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

    శాసన సభలో ఉన్న బలాబలాలను బట్టి బిజెపి నుండి నలుగురు, శివసేన, ఎన్సీపీ ల నుండి ఇద్దరేసి, కాంగ్రెస్ నుండి ఒక్కరు చొప్పున పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. దానితో అందరు ఏకగ్రీవంగా ఎన్నిక కాగలరని అనుకున్నారు.

    అయితే కాంగ్రెస్ ఒకరికి బదులుగా ఇద్దరినీ బరిలోకి దింపాలని నిర్ణయించడంతో శివసేన నివ్వెరపోయింది. కాంగ్రెస్ ఇద్దరిని పోటీకి దింపితే ఎన్నికలు అనివార్యం అయ్యే అవకాశం ఉంది.

    దానితో ఆగ్రహం చెందిన శివసేన నేతలు కాంగ్రెస్ కు హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ తన రెండో అభ్యర్థిని నిలబెట్టే పక్షంలో ఉద్ధవ్ థాక్రే పోటీ చేయబోరని అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి భంగం కలిగే అవకాశం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.

    ఉద్ధవ్ థాక్రే ఈ నెల 27 లోగా మండలికి ఎన్నిక కానీ పక్షంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. కూటమి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని సంజయ్ రౌత్ ఒక విధంగా హెచ్చరిక చేయడంతో మహారాష్ట్ర మరోసారి రాజకీయ అస్థిరత్వం వైపు వెడుతున్నదా అనే అనుమానాలకు తెరలేపిన్నట్లు అయింది.

    అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి ఒక్కరినే పోటీకి దింపుతున్నట్లు ప్రకటించడంతో రాజకీయ సంక్షోభం సమసిపోయిన్నట్లు అయింది. ఉద్ధవ్ థాక్రే ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం అయిన్నట్లు అయింది.