Afghanistan: అఫ్గన్ లో మహిళల పరిస్థితి కడు దయనీయం

Afghanistan: అఫ్గనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. దేశం విడిచి వెళ్లాలనుకున్నా కుదరడం లేదు. తాలిబన్ల (Taliban) చెరలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వారి నియంతృత్వ పాలనలో మహిళలైతే (Women) చాలా తిప్పలు పడుతున్నారు. దేశం విడిచి వెళ్లాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది కాబుల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానీయులంతా దేశం వదిలేందుకే మొగ్గు చూపుతున్నా వీలు […]

Written By: Srinivas, Updated On : August 29, 2021 4:41 pm
Follow us on

Afghanistan: అఫ్గనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. దేశం విడిచి వెళ్లాలనుకున్నా కుదరడం లేదు. తాలిబన్ల (Taliban) చెరలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వారి నియంతృత్వ పాలనలో మహిళలైతే (Women) చాలా తిప్పలు పడుతున్నారు. దేశం విడిచి వెళ్లాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది కాబుల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానీయులంతా దేశం వదిలేందుకే మొగ్గు చూపుతున్నా వీలు కావడం లేదు. చివరి వరకు ప్రయత్నించి ఇక ఏదైనా జరగనీ తమకు ప్రాణాలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు అని నిర్ణయించుకుని సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఎయిర్ పోర్టులో ఎదురు చూసి భరించలేక తమ ఊళ్లకు వెళుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు రోడ్లపై పడే తిప్పలు చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ తాలిబన్లకు మాత్రం అది లేదని తెలుస్తోంది. చావైనా రేవైనా తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

అఫ్గనిస్తాన్ కు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు షరిన్ తబ్రిక్ (43) దేశం విడిచి వెళ్లేందుకు ఐదు రోజుల క్రితం కాబుల్ హమీద్ కర్జాయ్ విమనాశ్రయానికి చేరుకుంది. ఐదు రోజులు అక్కడే బస చేసింది. కానీ ఆమెకు దేశం విడిచి వెళ్లేందుకు సాధ్యం కాదని తెలుసుకుని తిరిగి సొంత ఊరికి వెళ్లిపోయింది. దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. దేశం విడిచి వెళ్లాలని భావించినా అది కుదరదని తెలిసిపోయిందని వాపోయింది.

తాలిబన్లు మహిళలపై జరుపుతున్న దాడులపై అందరిలో భయం పట్టుకుంది. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు తాపత్రయపడుతున్నారు. అమెరికన్లు కూడా అఫ్గనీయులను అవమానిస్తున్నారు. అన్ని పత్రాలున్నా దేశం విడిచి వెళ్లడానికి అనుమతులు రావడం లేదు. దీంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సొంత దేశంలో కూడా పరాయి వారిలో బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.

కాబుల్ విమానాశ్రయంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక విదేశీయులెవరిని మాత్రం అడ్డుకోకుండా పంపిస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్న తమను ఎందుకు వెళ్లనివ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాలిబన్లు అడుగడుగునా ఆపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఓ వైపు ఉగ్రదాడులు, తాలిబన్ల ఆగడాలతో జనానికి నిద్ర కరువవుతోంది. అయినా తప్పని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.