https://oktelugu.com/

NTR30: ఎన్టీఆర్, కొరటాల మూవీకి మరో ట్విస్ట్

Anirudh Music for NTR Movie:  ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కొబ్బరికాయ కొట్టేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలపై పడ్డారు. ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షోను కంప్లీట్ చేసి తన కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించాడు. నిజానికి ముందుగా త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నా సరైన కథ ఓకే కాకపోవడంతో వీరిద్దరి మూవీ పట్టాలెక్కలేదు. ఆ […]

Written By: , Updated On : August 28, 2021 / 05:41 PM IST
Follow us on

Anirudh Ravichander to Compose Music NTR's Next Movie

Anirudh Music for NTR Movie:  ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కొబ్బరికాయ కొట్టేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలపై పడ్డారు. ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షోను కంప్లీట్ చేసి తన కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించాడు. నిజానికి ముందుగా త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నా సరైన కథ ఓకే కాకపోవడంతో వీరిద్దరి మూవీ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ హీరో మహేష్ బాబు తో సినిమా అనౌన్స్ చేసేశాడు. ఇక ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్టు తెలిపాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబోలో మరో సినిమా వస్తోందని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే కొరటాల సినిమా మ్యూజిక్ గురించి అనిరుధ్ తో చర్చలు జరుపనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్-కొరటాల సినిమాకు తమిళ సంగీత సంచలనం మ్యూజిక్ అందిస్తున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.