Today Exclusive Tollywood Updates:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో లూసిఫర్ లో మంజు వారియర్ పోషించిన కీలక పాత్రను తెలుగులో వచ్చే సరికి అనసూయ నటించబోతుంది. అనసూయను ఈ పాత్రకు ఎంచుకోవడానికి కారణం.. ఆ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. కాబట్టి ఆమె అయితేనే బాగుంటుంది అని టీమ్ భావించింది.

‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా వచ్చే నెల 14న నుండి ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ జరగబోతున్నాయి.

నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 13న ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. మరి ఈ చిత్రంతో బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

కల్యాణ్ దేవ్ హీరోగా వస్తోన్న ‘కిన్నెరసాని’ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కాగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట.