
Adireddy Bhavani : ఏపీ రాజకీయాల్లో దివంగత నేత ఎర్రన్నాయుడిది ప్రత్యకస్థానం. ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా రెండుసార్లు గెలుపొందారు.ఇక అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్భన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు పోటీ చేయడం దాదాపు ఖరారైంది. కానీ ఆదిరెడ్డి భవానీ విషయంలో మాత్రం స్పష్టత లేదు. అందుకు కుటుంబసభ్యుల వైఖరే కారణంగా తెలుస్తోంది.
అనూహ్యంగా ఎమ్మెల్యేగా..
2019 ఎన్నికల్లో తొలిసారిగా భవానీ రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి పోటీచేశారు. ఎమ్మెల్యేగా 30 వేల మెజార్టీతో గెలుపొందారు. అంటి వైసీపీ వేవ్ లో సైతం మంచి మెజార్టీనే సొంతం చేసుకున్నారు. తండ్రి ఎర్రన్నాయుడు, మామ ఆదిరెడ్డి అప్పారావుకు ఉన్న మంచి పేరుతోనే ఆ మెజార్టీ సాధ్యమైంది. అటు ఎమ్మెల్యేగా కూడా ఆమె యాక్టివ్ గానే ఉన్నారు. పార్టీ పవర్ లో లేకున్నా పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. దీంతో మరోసారి పోటీచేసినా ఆమెకు ఆదరణ దక్కే అవకాశాలున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేగా మంచి మార్కులు పడడంతో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధిస్తారన్న టాక్ అయితే ఉంది.

భర్త కోసం పట్టు..
అయితే ఆమెకు మెట్టినింట నుంచి పోటీ ఎదురవుతోంది. ఈసారి భవానీకి బదులు ఆమె భర్త వాసుకు టిక్కెట్ ఇవ్వాలని మామ అప్పారావు కోరుతున్నారు. అయితే వాసు విషయంలో పార్టీ శ్రేణుల్లో భిన్న వైఖరి ఉంది. భవానీ గెలిచిన తరువాత ఆమెకు బదులుగా భర్త ఆదిరెడ్డి వాసు రంగంలోకి దిగి వ్వవహారాలు అన్నీ చక్క బెడుతూ వస్తున్నారు. ఆయనే డిఫ్యాక్టో ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. దాంతో ఆదిరెడ్డి వాసుకు అక్కడ మొదటి నుంచి పాతుకుపోయిన మాజీ మంత్రి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గానికి పడడంలేదు. దాంతో ఇదొక తలనొప్పిగా మారింది. ఎలా తేల్చాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనపై హైకమాండ్ స్పందించడం లేదు.
ఎటూ చెప్పలేకపోతున్న అచ్చెన్న..
రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కాపులు, వెలమలు, బీసీలు అధికం. అయితే ఈ సీటులో ఈసారి తానే పోటీ చేయాలని ఆదిరెడ్డి వాసు డిసైడ్ కావడమే కాకుండా చంద్రబాబు లోకేష్ ల వద్ద కూడా ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. తాను కాకుండా తన భర్త కె ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి అని భార్య కూడా కోరుకుంటుంది. అయితే తెలుగుదేశం వర్గాలలో మాత్రం వాసు కంటే ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తేనే విజయం సాధిస్తుంది అన్న మాట ఉంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు సైతం తన అన్న కుమార్తె అభర్ధిత్వం విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి.