Good scheme in SBI : ముఖ్యంగా సామాన్య ప్రజలతోపాటు, మధ్యతరగతి కుటుంబాలు కూడా చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసి వాటిని పెట్టుబడిగా పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారి కోసం భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు మరియు అత్యంత విశ్వసనీయమైన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ సమయానికి పెద్ద రాబడి అందుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకంలో నెల నెల డిపాజిట్ చేయాలి. మీరు ఐదేళ్ల వరకు ఈ పథకంలో నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు పెట్టిన మొత్తం మీద మీరు చివరిలో మంచి రాబడి పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. మీరు పెట్టిన మొత్తం మీకు మెచ్యూరిటీ సమయానికి కచ్చితంగా తిరిగి వస్తుంది. గ్యారెంటీడ్ వడ్డీ కూడా మీకు ఈ పథకంలో లభిస్తుంది.
మీరు మినిమం రికరింగ్ డిపాజిట్ పథకంలో రూ.100 రూపాయలు అంటే ప్రతిరోజు కేవలం మూడు రూపాయల కంటే తక్కువగా మీరు ఈ పథకంలో పెట్టుబడి చేసినట్లయితే మీ భవిష్యత్తులో మీరు మంచి రాబడి పొందొచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి నెల 100 రూపాయలు ఐదేళ్లపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ పథకంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు కేవలం వడ్డీనే రూ.1,106 పొందవచ్చు. అంటే మీరు ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి రూ.7,106 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పథకంలో రూ.500 క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు పెట్టుబడి చేసినట్లయితే మీరు పెట్టే పెట్టుబడి మొత్తం రూ.30 వేలు అవుతుంది.
Also Read : జులై 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు అమలు..
ఇక వడ్డీ రూ.5,528 లభిస్తుంది. మొత్తం కలిపి మీకు ఐదేళ్ల తర్వాత రూ.35,528 మీ ఖాతాలో జమ అవుతాయి. అలాగే ఒకవేళ మీరు ఈ పథకంలో క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు నెలకు ₹1000 ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.60 వేలు అవుతుంది. దీనిపై మీరు పొందే వడ్డీ రూ.11,057. ఐదేళ్ల తర్వాత మీరు మెచ్యూరిటీ సమయానికి రూ.71,057 అందుకోవచ్చు. నెల నెల 1000 రూపాయలు అంటే రోజుకు కేవలం 33 రూపాయిలు మాత్రమే అవుతుంది. కానీ ప్రతిరోజు కనీసం 33 రూపాయిలు మీరు మీ ఖాతాలో పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తం అందుకోవచ్చు.