Viswambhara Teaser : ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ మూవీ లోని షాట్ ని ‘విశ్వంభర’ టీజర్ కి వాడేసారా..? ప్రేక్షకులను భలే మోసం చేసారుగా!

ఏదైనా సినిమాకి సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ ని కానీ చూసినప్పుడు మనకి ఒక అభిప్రాయం కలుగుతుంది. అది పాజిటివ్ అభిప్రాయం అవ్వొచ్చు, నెగటివ్ అభిప్రాయం అవ్వొచ్చు, ఆ అభిప్రాయం అంత తేలికగా మారదు. కాబట్టి ఒక సినిమాకి టీజర్ ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తప్పనిసరి, హైప్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. విశ్వంభర చిత్రం టీజర్ లో అదే లోపించింది.

Written By: Vicky, Updated On : October 12, 2024 1:24 pm
Follow us on

Viswambhara Teaser: ఏదైనా సినిమాకి సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ ని కానీ చూసినప్పుడు మనకి ఒక అభిప్రాయం కలుగుతుంది. అది పాజిటివ్ అభిప్రాయం అవ్వొచ్చు, నెగటివ్ అభిప్రాయం అవ్వొచ్చు, ఆ అభిప్రాయం అంత తేలికగా మారదు. కాబట్టి ఒక సినిమాకి టీజర్ ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తప్పనిసరి, హైప్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. విశ్వంభర చిత్రం టీజర్ లో అదే లోపించింది. కాసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ లోని గ్రాఫిక్స్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. ఈటీవీ, స్టార్ మా చానెల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో కూడా ఇలాంటి గ్రాఫిక్స్ ఉండవు అంటూ ట్రోల్ చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ లో మనల్ని ప్రత్యేకించి ఆకట్టుకున్నది ప్రారంభం లో వచ్చిన అంతరిక్షం లోని షాట్.

అది చూడగానే అభిమానులు ఊగిపోయారు. అయితే ఆ షాట్ ని కూడా కాపీ కొట్టారని సోషల్ మీడియా లో ట్రోల్స్ కనిపిస్తున్నాయి. హాలీవుడ్ సూపర్ హీరోస్ చిత్రంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ లోని ఒక షాట్ కి, విశ్వంభర టీజర్ షాట్ కి పోల్చి చూస్తే రెండు ఇంచు మించు ఒకేలాగా అనిపిస్తుంది. ఇది యాదృచ్చికమా, లేదా డైరెక్టర్ వశిష్ఠ ఆ షాట్ నే కాపీ కొట్టి ఇందులో పెట్టాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ ‘ఈ టీజర్ ని కట్ చేసేందుకు 15 రాత్రులు నిద్రపోకుండా ఉండాల్సి వచ్చింది, అంత కష్టపడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. ఆయన కష్టపడినా ఔట్పుట్ మాత్రం ఫ్యాన్స్ కి కనిపించలేదు. ఆయన కావాలని టీజర్ మీద హైప్ పెంచడానికి అలా చెప్పాడా?, లేకపోతే అతనికి ఇంతకు మించిన టాలెంట్ లేదా అనే సందేహం అభిమానుల్లో కలిగింది. ఇప్పుడు ఈ టీజర్ కి వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని డైరెక్టర్ తీసుకుంటాడా?, లేక తాను ఒక అద్భుతమైన టీజర్ కట్ ని చేశాను, గ్రాఫిక్స్ వర్క్ అదిరిపోయింది అనే భ్రమలో ఉంటాడా అనేది చూడాలి.

నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని మార్పులు చేర్పులు చేసుకుంటే మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా కి హద్దు అనేదే ఉండదు. ఎందుకంటే టీజర్ చూడగానే మంచి స్టోరీ లైన్ అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. మంచి స్టోరీ లైన్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా క్వాలిటీ ని కూడా మైంటైన్ చేయాలి, అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకి అయినా వండర్స్ చూడగలం. ఈ విషయం లో ‘హనుమాన్’ మూవీ మేకింగ్ ని ప్రతీ దర్శకుడు ఒక కేసు స్టడీ లాగా తీసుకోవాలి. 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 400 కోట్ల రూపాయిల క్వాలిటీ ని చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. గ్రాఫిక్స్ విషయంలో విశ్వంభర డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ నుండి సలహాలు తీసుకుంటే మంచిది అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Tags