
వాణివిశ్వనాథ్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ..! అవును ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరోయిన్. మెగాస్టార్‌తోనూ స్టెప్పులేసిన స్టార్. మెగాస్టార్‌తో ఓ సినిమాలో వానపాటలో డ్యాన్స్ చేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఒకవిధంగా చెప్పాలంటే ఆ పాటలో ఆమె ఆరబోసిన అందాలకు అందరూ ఫిదా అయ్యారు. స్వేచ్ఛగా అందాల విందు చేస్తుందని ఈ హీరోయిన్‌కు అప్పట్లో పేరుండేది.
Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట
ఇన్నాళ్లు మరుగున పడిన ఆమె పేరు తాజాగా తెరమీదకు వచ్చింది. అది సినిమా రంగంలో కాదు. రాజకీయ రంగంలో. ఆమె ఎవరో కాదు వాణీ విశ్వనాథ్. కొన్నేళ్ల కిందట ఈమె పేరు తెలుగు రాజకీయాల్లో జోరుగా వినిపించింది. కానీ.. ఆ తరువాత కనుమరుగైంది. ఆమె పేరును మళ్లీ ఇప్పుడు బీజేపీ నాయకులు బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే సెల్వమణికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష బీజేపీ భారీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికనే ముహూర్తంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే.. తిరుపతి ఉప ఎన్నిక సమయానికే నగరిలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను బరిలోకి దింపటానికి బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఆమెను బీజేపీలోకి తీసుకొచ్చి.. రోజాకు పోటీగా మరో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్టు కమలదళంలో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఇప్పటికే ఆమెతో కొందరు బీజేపీ నేతలు చర్చించినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే తిరుపతి ఉప ఎన్నిక సమయానికి వాణీ విశ్వనాథ్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రచారంలోకి దిగడం ఖాయం. సో.. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి మరో లేడీ ఫైర్ బ్రాండ్‌ను సిద్ధం చేయాలని బీజేపీ ప్లాన్.
Also Read: దెబ్బకు ఆ ఎస్పీ సెలవు పెట్టి వెళ్లాడు..!
ఇప్పటి నుంచే బరిలో ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి రోజా మీద పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పినట్టు తెలిసింది. నగరి నుంచి రోజా రెండుసార్లు గెలిచింది. 2019లోనే వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరుతుందని.. రోజా మీద పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ.. ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బరిలో నిలవలేదు. వాస్తవానికి వాణీ విశ్వనాథ్ 2017లోనే తెలుగుదేశం పార్టీలో చేరింది. కానీ.. చంద్రబాబు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె చెన్నై వెళ్లిపోయింది.
ఇప్పుడు మరోసారి బీజేపీ తమ పార్టీలోకి లాగాలని చూస్తోంది. అయితే.. ఈ తరంవారికి వాణీ విశ్వనాథ్ ఎవరో పెద్దగా తెలియదు. ఆమె తెలుగు సినిమా రంగంలోనూ లేదు. అయితే.. ఇప్పుడు ఏపీలో బీజేపీలోకి తీసుకొస్తే.. ఆమెను ఎంతవరకు ఆదరిస్తారో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్