Actor Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి కృష్ణానగర్ రోడ్ల మీద, ప్రసాద్ ల్యాబ్ లోని పార్కింగ్ ఏరియాలో తిరుగుతుంటే సినీ కార్మికులు కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇక ఇండస్ట్రీ పెద్దలు అయితే, ఆర్ నారాయణమూర్తి అనే వ్యక్తి వస్తే.. కూర్చోమని చెప్పండి అంటూ ఆయనను గంటల తరబడి వెయిట్ చేయించిన సంఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. అయితే, అలాంటి ఆర్ నారాయణమూర్తి మాత్రమే ఇప్పుడు తెలుగు తెరకు వెలుగు చూపించాడు.
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ చాలా ముఖ్యం. కానీ, కరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సీజన్ లోనే థియేటర్స్ పై ఉక్కుపాదం మోపింది. ఇక ఈ సీజన్ పోతే తెలుగు పరిశ్రమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ పెద్దలు, బడా స్టార్లు అంతా దిగులు పెట్టుకున్నారు. ఇక రంగంలోకి చిరు దిగుతారు, సమస్య పోతుంది అని ఆశ పడ్డారు.
Also Read: న్యూ ఇయర్ సందర్భంగా.. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
చిరు ఈ సమస్య పై చాలా కసరత్తు చేశారు. రిక్వెస్ట్ లు చేశారు. కానీ జగన్ ప్రసన్నం కాలేదు. ఇక మెగాస్టార్ కూడా ఏమి చేయలేడు అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చాడు ఆర్ నారాయణమూర్తి. ఆయన జోక్యంతో తెలుగు సినిమా పై జగన్ కరుణ చూపించాడు. థియేటర్స్ పై పెట్టిన నిబంధనల ఉల్లంఘన విషయంలో వెసులుబాటు కల్పించాడు.
ఏపీలో మూసివేసిన 100 సినిమా థియేటర్లను తెరిచే అవకాశం కల్పించాడు. ఆర్ నారాయణ మూర్తి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఆర్ నారాయణ మూర్తి కి విలువ పెరిగింది. ఆయన ఎక్కడ ఉన్నారో అంటూ కొందరు పెద్ద నిర్మాతలు ఆరా తీస్తున్నారు.
ఇక నుంచి ఏపీ ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఆర్ నారాయణ మూర్తి గారినే ముందు పెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. థియేటర్లతో పాటు టికెట్ సమస్యలపై కూడా ఆర్ నారాయణ మూర్తి గారి చేత మాట్లాడించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చేయలేనిది, నారాయణ మూర్తి చేయడం గొప్ప విషయమే.
Also Read: ‘వంగవీటి’ ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుంటారా?