Telugu News » India » Centre heeds to telangana demand on rolling back gst hike on textiles
GST: జీఎస్టీ పేరుతో జనాలకు టోపీ పెడుతున్నారు.. తప్పు ఎవరిది?
GST: ప్రజలందరూ గత రెండు సంవత్సరాలుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం లేదు. ఈసారి కూడా ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రజలందరూ సిద్ధం అవుతున్నారు. ఇక కొత్త ఏడాదిలో కేంద్రం జీఎస్టీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. కొత్త ఏడాదిలో వస్త్రాలపై జీఎస్టీ ఐదు నుండి పన్నెండు శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే జీఎస్టీ […]
GST: ప్రజలందరూ గత రెండు సంవత్సరాలుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం లేదు. ఈసారి కూడా ఆంక్షల మధ్య న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రజలందరూ సిద్ధం అవుతున్నారు.
ఇక కొత్త ఏడాదిలో కేంద్రం జీఎస్టీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. కొత్త ఏడాదిలో వస్త్రాలపై జీఎస్టీ ఐదు నుండి పన్నెండు శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే జీఎస్టీ పెరగడం పై చాలా మంది అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన జీఎస్టీ ధరలు జనవరి 1 నుండి అమలు లోకి రాబోతున్నాయి.
GST
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వరుసగా రెండు, మూడు రోజుల నుండి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మీ నిర్ణయాన్ని మీ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.. ఇలా అయితే చేనేతలు తిరుగుబాటు చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న జీఎస్టీ ని పెంచాలా… తగ్గించాలా అన్నది జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయిస్తారు.
ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి కూడా సభ్యునిగా ఉంటారు. మరి అలంటి సమయంలో దుస్తులపై పన్ను పెంచినప్పుడు కూడా తెలంగాణ ఆర్ధిక మంత్రి ఉండే ఉంటారు.. ఆ సమయంలో ఆయన సైలెంట్ గా ఉన్నారా? లేదంటే వ్యతిరేకించారా? లేదు అంటే సమర్ధించారా ? నిజానికి ఏ నిర్ణయంలో అయినా మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకం వ్యక్తం చేస్తే ఆ నిర్ణయం అమలు చేసే అవకాశం ఉండదు.
కానీ జీఎస్టీ అనేది కేంద్రం పన్ను అని జనం భావిస్తారు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తమ ప్రభుత్వాలకు వచ్చే నష్టం ఏమి లేదని అందుకే రాష్ట్రాలు సైలెంట్ గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం అమలు లోకి వచ్చే ముందు వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆదాయం ఎక్కువుగా ఉన్న వారి నుండి పన్ను వసూలు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు జీఎస్టీ పేరుతొ, పెట్రోల్, డీజిల్ పేరుతొ మిగిలిన వారి జేబులు కూడా ఖాళీ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వస్త్రాలపై కూడా పన్నులు వేస్తూ ఇండియాలో దారుణమైన పరిస్థితిని కల్పిస్తున్నారు. మిగతా ఏ దేశాల్లో ఇలా ఉంటుందో లేదో తెలియదు కానీ మన ఇండియా లో మాత్రం పన్నుల పేరుతో, జీఎస్టీ పేరుతొ ప్రతి వస్తువుకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఇండియాలోనే ఉంది. ఈ పరిస్థితికి మేము కారణం కాదంటే మేము కాదు అని అందరు తప్పిచుకుంటూ జనాలకు కుచ్చు టోపీ పెడుతున్నారు.