https://oktelugu.com/

ట్రంప్‌నకు చైనాలో ఖాతా.. ఒబామా బిగ్‌ బాంబ్‌

అగ్రరాజ్యం ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ బరిలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగారు. వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. Also Read: అమరావతి అక్రమాలపై విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ అమెరికా అధ్యక్ష పదవి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 02:47 PM IST
    Follow us on

    అగ్రరాజ్యం ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ బరిలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగారు. వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

    Also Read: అమరావతి అక్రమాలపై విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

    అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ దింపాలని ఒబామా పిలుపునిచ్చారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆయన విఫలమయ్యారని.. దీంతో చాలా మంది అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. అమెరికాలో నాటి పరిస్థితులు రావాలంటే బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి..? కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలో బైడన్‌, కమలా హ్యారిస్‌ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్నారు.

    ట్రంప్‌ చేపట్టిన ఆర్థిక చర్యలు మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ మాదిరి ఉన్నాయన్నారు. ఆ సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా ఛిన్నాభిన్నం అయిందో.. ఇప్పుడూ అలాంటి పరిస్థితే ఉందన్నారు. మరోవైపు ట్రంప్‌ కరోనా చర్యలు పాటించకపోవడాన్నీ ఒబామా దుయ్యబట్టారు. ప్రజలకు దూరంగా స్టేజ్‌పైన ఉంటూ ప్రచారం చేసినా మాస్కు ధరించకుండానే మాట్లాడుతున్నారు.. అక్కడికి వచ్చిన ప్రజల పరిస్థితి ఏం కావాలి అని ప్రశ్నించారు.

    Also Read: బీజేపీ వరం: ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

    ట్రంప్‌పై ఒబామా మరో బిగ్‌బాంబ్‌ కూడా వేశారు. తాజాగా వెల్లడైన వివరాల మేరకు ట్రంప్‌నకు చైనా బ్యాంకులో ఖాతా ఉందని చెప్పుకొచ్చారు. రహస్యంగా లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఆయనకు అదెలా సాధ్యమైందని.. అసలు రహస్యంగా ఖాతా తెరవడం ఏంటని అడిగారు. ట్రంప్‌ దేశ రక్షణకు కృషి చేయడంలేదని.. తనను తాను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజలు 2016లో చేసిన తప్పును పునరావృతం చేయరని ఆకాక్షించారు.