కరోనా టైంలోనూ బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్’ అలరిస్తున్నాడు. గతంలో వచ్చిన బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీజన్లు బుల్లితెరపై సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో బిగ్ బాస్-4పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలను ‘బిగ్ బాస్’ నిలబెట్టుకోలేదని టాక్ విన్పిస్తోంది.
Also Read: జానీ మాస్టర్ మాటలకు తెగ ఫీల్ ఆయిన అనసూయ !
బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం రోజు నుంచే ఈ షో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ షోలో పాల్గొన్న వారంతా పెద్దగా సెలబ్రెటీలు కాకపోవడంపై ప్రేక్షకులు కొంత నిరుత్సాహం చెందారు. అయినప్పటికీ బిగ్ బాస్-4 లాంచింగ్ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
అయితే ఆ టీఆర్పీ కొనసాగించలేక చతికిలపడిపోతుంది. షోలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో తొలినాళ్లలో బిగ్ బాస్-4ను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే బిగ్ బాస్ కంటెస్టుల నడుమ అలరించే టాస్కులు పెడుతుండటంతో క్రమంగా ఆడియన్స్ కనెక్టవుతూ వచ్చారు. దీంతో బిగ్ బాస్ క్రమంగా పుంజుకున్నట్లు అనిపించింది.
ఇక బిగ్ బాస్-4 సీజన్ సమయంలో ఐపీఎల్ మొదలవడంతో ఆ ఎఫెక్ట్ షోపై పడినట్లు కన్పిస్తోంది. దీనికితోడు బిగ్ బాస్ తొలి రెండు మూడువారాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంటెస్టుల ఫూర్ ఫార్మమెన్స్.. ఎలిమినేషన్ ఉత్కంఠగా లేకపోవడం వంటివి కూడా షోపై ప్రభావం చూపినట్లు కన్పిస్తోంది.
బిగ్ బాస్-3కి హోస్టుగా నిర్వహించిన కింగ్ నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా హోస్టుగా చేస్తున్నాడు. బిగ్ బాస్-4లో నాగార్జున ఒక్కడే గేమ్ బాగా ఆడుతున్నారని.. మిగతావాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ సగానికి చేరుకుంది. అయినప్పటికీ షోపై పెద్దగా అంచనాలు ఏర్పడటం లేదని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ టీఆర్పీ క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆగిన మహేష్ ‘సర్కారు వారి పాట’.. ఆందోళనలో డైరెక్టర్..!
గత సీజన్లలో బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్ ను ఎంటటైన్మెంట్ చేయలేకపోతున్నాడని టాక్ విన్పిస్తోంది. టీఆర్పీలోనూ బిగ్ బాస్-4 వెనుకబడటంతో నిర్వాహకుల్లో ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా బిగ్ బాస్ మెల్కోంటాడా లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!