https://oktelugu.com/

Maharashtra-Jharkhand Election Results : కౌంటింగ్‌ షురూ.. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే ఫలితాలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ శనివారం(నవంబర్‌ 23న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 23, 2024 / 10:48 AM IST

    Maharashtra-Jharkhand Election Results

    Follow us on

    Maharashtra-Jharkhand Election Results : దేశంలో రెండు నెలలుగా ఆసక్తి చేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 20 ముగిసింది. దీంతో నవంబర్‌ 23న ఈసీ కౌంటింగ్‌ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో మరో మూడు నాలుగు గంటల్లో రానున్నాయి. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమికి, జార్ఖండ్‌లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇందులోనూ ఎగ్జిట్‌ పోల్స్‌కు కాస్త అటూ ఇటుగా ఫలితాలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ కూడా జరుగుతోంది.

    రెండు రాష్ట్రాల్లో స్థానాలు ఇలా..
    ఇక ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు స్థానాలు పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. వీటికి ఒకే విడతలో నవంబర్‌ 20 పోలింగ్‌ జరిగింది. మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్‌ అగాడి కూటములుగా పోటీ చేశాయి. బీజేపీ నేతృత్వంలో మహాయుతి, కాంగ్రెస్‌ నేతృత్వంలో మహావికాస్‌ అఘాడీ పోటీ చేశాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 145 స్థానాలు గెలవాలి. ఇక జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 45 స్థానాలు అవసరం.

    ఎర్లీ ట్రెండ్స్‌ ఇలా..
    ప్రస్తుతం ఈవీఎంల కౌంటింగ్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం మహాయుతి 137 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహా వికాస్‌ అఘాడీ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాలు పోటా పోటీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలై కాంగ్రెస్‌ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక జార్ఖండ్‌లో కూడా ఫలితాలు ఇలాగే వస్తున్నాయి. ఇక్కడ బీజేపీ 36 స్థానాల్లో, కాంగ్రెస్‌ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.