game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడిగా వచ్చి ప్రస్తుతం తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో రామ్ చరణ్… ఇక తనదైన రీతిలో సత్తా చాటుతూ ఇప్పుడు మెగాస్టార్ కొడుకుగా కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా తనకంటూ స్వతహాగా ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తిరగ రాయడంలో కూడా ఈ హీరో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ తనలోని నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా భారీ రేంజ్ లో చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 21వ తేదీన అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో జరుపుకోలేదు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఈ ఫీట్ ను అందుకోబోతున్న మొదటి సినిమాగా ఇండియన్ ఇండస్ట్రీలో ఒక హిస్టరీ ని క్రియేట్ చేయబోతుంది…
ఇక ఈ ఈవెంట్ ని డిసెంబర్ 21వ తేదీన కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్ లాండ్ టి ఎక్స్ 75040 లో అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు రాజేష్ కల్లేపల్లి మెగా ఫ్యాన్ గా ఉండటమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఆయనకు అమితమైన ఇష్టమట.
అందుకే తను హిస్టరీలో ఇప్పటివరకు జరగని ఒక సరికొత్త అధ్యయనానికి తెరలేపుతున్నాడనే చెప్పాలి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అమెరికాలో ఈ ఈవెంట్ చేయడం వల్ల గేమ్ చేంజర్ సినిమాకు వచ్చే లాభమేంటి అని చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికా గడ్డమీద జరిపితే ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి తెలుస్తుంది.
తద్వారా వివిధ భాషల్లో ఈ సినిమాకి భారీ క్రేజ్ రావడమే కాకుండా ఈ సినిమా మీద హైప్ కూడా పెరుగుతుంది. కలెక్షన్స్ ను కూడా భారీ రేంజ్ లో కొల్లగొట్టొచ్చనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక బిజినెస్ స్ట్రాటజీని జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతి కానుక గా వస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తే గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న రామ్ చరణ్ మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నవాడు అవుతాడు…