https://oktelugu.com/

Janasena : జన సైనికులను దారికి తెచ్చిన ఆర్కే

సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపికి అతి తక్కువ స్థానాలను కట్టబెడుతూ ఎల్లో మీడియా కథనాలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం జన సైనికులకు శాంతి పరిచేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 26, 2024 / 05:23 PM IST
    Follow us on

    Janasena : జన సైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు లభించడం పై ఆగ్రహంగా ఉన్నారు. పవన్ మాత్రం ఈ విషయంలో శ్రేణులను సముదాయించే పనిలో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీనిని అవమానంగా భావిస్తున్నారు. తమ బలాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సరికొత్త కథనం రాసుకొచ్చారు. జనసైనికులను దారికి తెచ్చేలా ఈ కథనం ఉండడం విశేషం.

    పొత్తులో భాగంగా బిజెపికి నాలుగు పార్లమెంట్ స్థానాలు, నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు ఈ కథనం సారాంశం. దీంతో ఒక జాతీయ పార్టీగా బిజెపికి అన్ని తక్కువ సీట్లు ఇస్తున్నారని.. దానితో పోల్చుకుంటే జనసేనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ శ్రేణులు సంతృప్తి పొందేలా కథనం రాసుకొచ్చారు. అయితే అన్ని తక్కువ సీట్లకు బిజెపి ఒప్పుకుంటుందా? ఒప్పుకునే పరిస్థితిలో బీజేపీ ఉందా? అన్నది ఆర్కే రాయలేదు. 2014లోనే 12 అసెంబ్లీ సీట్లతో పాటు నాలుగు పార్లమెంట్ స్థానాలను బిజెపి పొత్తులో భాగంగా దక్కించుకుంది. అప్పట్లో కంటే ఇప్పుడు జాతీయస్థాయిలో బిజెపి దూకుడుగా ఉంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ తక్కువ సీట్లకు బిజెపి ఒప్పుకుంటుందా? ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం నిజమేనా? అని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు.

    అయితే ఇప్పుడు బిజెపి కంటే జనసేన ను సంతృప్తి పరచడం తెలుగుదేశం పార్టీ ముందున్న ఏకైక లక్ష్యం. పవన్ ఒప్పించిన చంద్రబాబు.. జన సైనికులను సంతృప్తి పరిచే పనిని ఎల్లో మీడియాకు అప్పగించారు. మరోవైపు పవన్ సైతం జనసేన 40 సీట్లలో ప్రభావితం చేయబోతుందని ప్రకటించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలు అంటే.. వాటి పరిధిలో మరో 21 స్థానాల్లో ప్రభావితం చేసినట్టే కదా అని పవన్ సరిపుచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపికి అతి తక్కువ స్థానాలను కట్టబెడుతూ ఎల్లో మీడియా కథనాలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం జన సైనికులకు శాంతి పరిచేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.