ABN RK vs KTR : టీవీ9, ఎన్ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలతో మంత్రి కేటీఆర్ అనుకున్నంత హైప్ రాలేదు. గంగవ్వ యూట్యూబ్ చానెల్ తో కేటీఆర్ వంట చేసి సోషల్ మీడియాలో వదిలాడు. వీటి వల్ల ఫాయిదా రాలేదు అనుకున్నాడో, ఇంకా మైలేజ్ కోసం పాకులాడుతున్నాడో తెలియదు కానీ సడన్ గా ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణతో ఇంటర్వ్యూకు ఓకే అనేసాడు. నిజానికి వేమూరి రాధాకృష్ణకు, కేసీఆర్ కు సంబంధాలు బాగా లేవు.. పైగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆర్కే గోకుతూనే ఉన్నాడు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిపొడుస్తూ రాస్తూనే ఉన్నాడు. ఇది సహజంగానే కెసిఆర్ కు చిరాకు కలిగిస్తోంది. ఫలితంగా అటు ఆంధ్రజ్యోతికి, ఇటు ఏబీఎన్ కు జాకెట్ యాడ్స్ ఇవ్వడం ఆపేశాడు. దీంతో రాధాకృష్ణకు, బీఆర్ఎస్ మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. ఉప్పు నిప్పు లాగా వ్యవహారం మారిపోయింది.
కలిశారా?
ఆమధ్య మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పిల్లర్లు కొన్ని కుంగిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో పెద్దగా వార్త రాలేదు. ఎక్కడో ఒక మూలన పడేశారు.. వాస్తవానికి మిగతా మీడియా సరెండర్ అయింది కాబట్టి పెద్దగా పట్టింపు లోకి రాలేదు. కానీ ఆంధ్రజ్యోతి మేడిగడ్డ వార్తను ప్రయారిటీ లేకుండా ఎక్కడో లోపలి పేజీలో వేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి కొంతమందికి అనుమానాన్ని కూడా రేకెత్తించింది. అనుకున్నట్టుగానే వాళ్ల అనుమానాలే నిజమయ్యాయి. ఆ మధ్య వేమూరి రాధాకృష్ణను కేటీఆర్ కలిసినట్టు, ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు..అందువల్లే ఆంధ్రజ్యోతి నిప్పు శకటాల లాంటి వార్తలు ప్రచురించడం లేదని మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు ఆంధ్రజ్యోతి పత్రికలో కేటీఆర్ కు ప్రయారిటీ ఇవ్వడం కూడా పై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ఆర్కే, కేటీఆర్ మధ్య చర్చలు సఫలం కావడం వల్లే ఆంధ్రజ్యోతి లో పింక్ పార్టీకి సముచితానికి మించి ప్రయారిటీ దక్కుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంటర్వ్యూకి కూడా ఓకే.
ఈమధ్య ఎన్టీవీ, టీవీ9 లో ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్.. అనుకున్నంత లాభం దక్కకపోవడంతో ఏబీఎన్ లో వేమూరి రాధాకృష్ణతో ఇంటర్వ్యూకి ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూ ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏబీఎన్ ఛానల్ లో ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రోమో విడుదలైంది. ” మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? సెంటిమెంట్ నే ట్రంక్ కార్డు లాగా గులాబీ పార్టీ ఉపయోగించుకుంటుందా? మేడిగడ్డ కుంగు బాటు కు ఏం సమాధానం చెబుతారు? ” అనే ప్రశ్నలు సంధించబోతున్నట్టు ఆర్కే ప్రోమోలో చెప్పకనే చెప్పారు. టీవీ9, ఎన్టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూలు పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. పైగా ప్రశ్నలు సంధించిన జర్నలిస్టులు కూడా ఒకింత భయంతోనే ఉన్నారు. రాధాకృష్ణ లో సహజంగానే టెంపర్ మెంట్ ఎక్కువ కాబట్టి ఈజ్ తీసుకునే అవకాశం ఉంది. పైగా ఆయనకు కెసిఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది. గతంలో కవిత పేరు లిక్కర్ స్కాం లో వినిపించినప్పుడు ఇదే రాధాకృష్ణ ఆమెతో ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో కవితను తన ప్రశ్నలతో చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. ఫలితంగా కవిత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కు గురయ్యారు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే చాలా సెట్టిల్డ్ గా సమాధానాలు చెబుతారు. మరి ఈ ఇద్దరిట్లో ఎవరిది పనిచేయనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.