https://oktelugu.com/

Amaravathi: మోకాళ్లతో దేకినా జగన్ అమరావతి ఇవ్వడు.. అమరావతి రైతులతో ఆంధ్రజ్యోతి ఆర్కే హాట్ కామెంట్స్

Amaravathi:అమరావతి సాధన కోసం తిరుపతి వరకూ పాదయాత్ర చేసిన రైతులను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చుండబెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ నిర్వహించారు. అందులో కొన్ని చేదు నిజాలను ఆ రైతులకు హితబోధ చేశాడు. రైతుల పాదయాత్ర వేస్ట్ అని స్పష్టం చేశారు. పాదయాత్రతో మీకు మోకాళ్ల నొప్పులు వచ్చినా.. మోకాళ్లతో దేకినా అమరావతి విషయంలో మీ ప్రయత్నాలు ఫలించవు అంటూ స్పష్టం చేశారు. ‘మోకాళ్లతో దేకినా.. జగన్ ఏపీకి సీఎంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2021 / 09:46 PM IST
    Follow us on

    Amaravathi:అమరావతి సాధన కోసం తిరుపతి వరకూ పాదయాత్ర చేసిన రైతులను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చుండబెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ నిర్వహించారు. అందులో కొన్ని చేదు నిజాలను ఆ రైతులకు హితబోధ చేశాడు. రైతుల పాదయాత్ర వేస్ట్ అని స్పష్టం చేశారు. పాదయాత్రతో మీకు మోకాళ్ల నొప్పులు వచ్చినా.. మోకాళ్లతో దేకినా అమరావతి విషయంలో మీ ప్రయత్నాలు ఫలించవు అంటూ స్పష్టం చేశారు.

    abn radhakrishna

    ‘మోకాళ్లతో దేకినా.. జగన్ ఏపీకి సీఎంగా ఉండగా అమరావతిని రాజధాని చేయడు’ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. అమరావతి రైతులకు హితబోధ చేశాడు.. ఈ మేరకు జగన్ తత్త్వాన్ని బోధించాడు. జగన్ లాంటి మొండి మనిషి మరొకరు లేరని.. ఆయన అనుకున్నాడంటే అది కాదని రైతులకు వివరించాడు.

    అయితే అమరావతి ఇష్యూనే కాదు.. జగన్ పాలన చూశాక ఎవరూ ఓటు వేయరని 2024లో జగన్ ను ఓడించి అమరావతిని సాధించుకుంటామని రైతులు మాత్రం ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని ఆపలేరు.. మమ్మల్ని ఎవరూ కొనలేరు అంటూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ రైతులు స్పష్టం చేశారు.

    2024లో జగన్ మళ్లీ సీఎం అయితే ఏంటీ పరిస్థితి అని ఏబీఎన్ ఆర్కే ప్రశ్నించగా.. తాము అస్సలే కానివ్వమని.. జగన్ కు ఆ అవకాశమే లేదని అమరావతి రైతులు కుండబద్దలు కొట్టారు. అమరావతి రైతులతో ఏబీఎన్ ఆర్కే చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. రైతులను న్యూస్ చానెల్ కు తీసుకొచ్చి మరీ రాధాకృష్ణ రాజేసిన మాటల మంటలు చర్చనీయాంశమవుతున్నాయి.