https://oktelugu.com/

RRR Rajamouli:‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇన్ స్పైర్ అతనే.. కథ అక్కడే మొదలైంది..: రాజమౌళి

RRR Rajamouli: తెలుగు బిగ్గెస్టు డైరెక్టర్ సారథ్యంలో వస్తున్న భారీ బడ్జెట్, మల్టీ స్టారర్ మూవీ ‘రణం రౌద్రం రుధిరం’ . దాదాపు రెండేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జనవరి 7న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై ఫ్యాన్స్ తో పాటు అశేష ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ సినిమాను గ్యాప్ తీసుకున్నా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసే జక్కన్న ఈ సినిమాకు కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మరోవైపు ఇద్దరు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 / 09:29 AM IST

    Rajamouli

    Follow us on

    RRR Rajamouli: తెలుగు బిగ్గెస్టు డైరెక్టర్ సారథ్యంలో వస్తున్న భారీ బడ్జెట్, మల్టీ స్టారర్ మూవీ ‘రణం రౌద్రం రుధిరం’ . దాదాపు రెండేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జనవరి 7న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై ఫ్యాన్స్ తో పాటు అశేష ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ సినిమాను గ్యాప్ తీసుకున్నా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసే జక్కన్న ఈ సినిమాకు కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మరోవైపు ఇద్దరు స్టార్ హీరోలతో ఎక్కడా తేడా రాకుండా సినిమా తీసినట్లు రాజమౌళి ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పారు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఏ కథ ఆధారంగా తీశారని కొందరు అడిగిన ప్రశ్నకు ‘చే గువేరా’ స్ఫూర్తితో తీశామని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

    RRR Rajamouli

    ‘ది మోటార్ సైకిల్ డైరీస్’ అనే చిత్రం నుంచి ఈ సినిమాను ఇన్ స్పైర్ గా తీసుకొని ఆర్ఆర్ఆర్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా కథ సింపుల్ గా ఉంటుంది. ఇందులో చివరిలో చే గువేరా అని ట్రివిల్ చేస్తారు. ఇది బాగా నచ్చింది. దీనిని మనం కూడా చేయొచ్చు కదా.. ఒక తెలియని స్టోరీని తీసుకొచ్చి.. ఆ వ్యక్తి కూడా ఫ్రీడం ఫైటర్ అని చెప్పొచ్చు కదా.. అని అనిపించింది. కానీ దానికి ఆర్ఆర్ఆర్ కు ఎటువంటి సంబంధం లేదు.

    Also Read:  2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!

    ఒకరోజు సడన్లీగా ఆలోచన వచ్చింది. అల్లూరి సీతారామారాజు గారి గురించి చదివాను. ఆ తరువాత కొమురం భీం గారి గురించి చదివాను. వీరిద్దరు రెండు, మూడు సంవత్సరాల తేడాతో జన్మించారు. ఇద్దరూ కూడా రెండు, మూడు సంవత్సరాలు మాయమయ్యారు.. ఆ తరువాత తిరిగొచ్చారు. ఇలా కొన్ని ఆసక్తిగా అనిపించాయి. ఆ కనిపించిన మూడు సంవత్సరాల పాటు వీరిద్దరు కలిసుంటే.. వీరిద్దరు ఒకరికొకరు ఇన్ స్పైర్ చేసుకుంటే అనే ఆలోచన చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అక్కడి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలైంది.

    ఇక ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ప్రతీ నటుడికి కథ నచ్చితేనే సినిమా చేస్తారు. అయితే ఆ కథను అద్భుతంగా తీర్చిదిద్దే దర్శకుడు ఉంటే ఇంకా అదృష్టమే. కథ విషయంలో రాజమౌళి గారిని ఎప్పుడూ అడగలేదు. ఆయన కథలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. కథా, దర్శకుడా.. అంటే మేం దర్శకుడు నచ్చడం వల్లే సినిమా చేశాం. ’

    అలాగే రామ్ చరణ్ మాట్లాడుతూ ‘మేం రాజమౌళి గారిని కలిసినప్పుడు కథ గురించి అస్సలు అడగలేదు. ఆయన ఏం చేస్తున్నారన్న విషయం మాకు తెలియదు. మీ ఇద్దరితో నాకో ఐడియా ఉంది. అని చెప్పారు. ఇద్దరు ఒకేసారి ఓకే చెప్పాం. కథ, మిగతా విషయాలు మా కంటే ఎక్కువ ఆయనకే తెలుసు. ఆయనేం చేయాలో అదే చేస్తారు. మాకు ఏది షూట్ అవుతుందో అదే చేస్తారో. ఆయన ఒక్క ఫోన్ చేశారంటేనే మాకు షూట్ అయ్యే పాత్రే చేస్తారని మేం అనుకుంటాం’

    Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?