AAP MPs Join BJP Rajya Sabha: అమిత్‌షా బీజేపీలో అత్యంత కీలక నేత. పార్టీలో చేరికలు, సస్పెన్షన్ల నిర్ణయాలు పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. పార్టీని సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంతో మోదీ–అమిత్‌షా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అందుకే వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా ఏప్రిల్ 24న ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనమైంది. ఇంత పెద్ద కార్యక్రమానికి అమితష్ అందుబాటులో లేరు. ఆయన బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా, హడావుడిగా ఈ పరిణామం జరిగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ దీనికి ఒక కారణం ఉందంటున్నారు విశ్లేషకులు?
ఆప్ పార్లమెంటరీ పార్టీ విలీనం..
ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నీ, రాజేందర్ పాల్ గుప్తా ఎంపీలు ఏప్రిల్ 24న నితిన్ నబీన్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. అమిత్ షా బెంగాల్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి ఏప్రిల్ 28న జరగాల్సిన కార్యక్రమం. కానీ ఎంపీల చేరిక విషయం బయటకు లీక్ అయింది. దీంతో కేజ్రీవాల్ అందరితో మాట్లాడడం మొదలు పెట్టారు. దీంతో మళ్లీ ఎంపీల మనసు మారుతుందేమో అని చేరికలను 24న అమిత్‌షా లేకుండానే నిర్వహించారు.
చేరిక వెనుక కారణాలు..
ఏడుగురు ఆప్ ఎంపీల చేరికకు వివిధ కారణాలు ఉన్నాయి. రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించారు. అంతకుముందు ఆయన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండె. కానీ కొందరు ఆయనను సైలెంట్‌గా ఉండాలని సూచించారు. దీంతో చద్దా కళ్ల ఆపరేషన్ పేరుతో లండన్ వెళ్లిపోయారు. తర్వాత కూడా కొంతకాలం లండన్‌లోనే ఉన్నారు. వచ్చాక బీజేపీలో చేరారు. ఇక అశోక్ మిట్టల్ పంజాబ్ లౌలీ యూనివర్సిటీ ఉంది. ఆయన యూనివర్సిటీపై ఇటీవల ఈడీ దాడులు జరిగాయి. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరారు. ఇక మరో ముగ్గురు ఎంపీలు పారిశ్రామిక వేత్తలు. వీరిని ఒప్పించడం బీజేపీకి ఈజీ అయిపోయింది. ఇక హర్భజన్‌సింగ్‌కు బీసీసీఐ నుంచి ఫోన్ రావడంతో పార్టీ మారారని చెబుతున్నారు. స్వాతి మరివాల్. ఈమె ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండేది. ఈమె కూడా పార్టీతో విభేదాల కారణంగా ఫిరాయించింది.
రాజ్యసభలో పెరిగిన బీజేపీ బలం..
ఆప్ సభ్యుల చేరికతో బీజేపీ సభ్యులు 106 నుంచి 113కి, ఎన్డీఏ 141 నుంచి 148కి చేరాయి. 245 సీట్ల సభలో మెజారిటీ 123 అవసరం. 2026 చివరిలో మూడింట రెండొంతుల మెజారిటీ కూడా సాధిస్తుంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదానికి దోహదపడుతుంది.
పంజాబ్ రాజకీయ ప్రభావం
పంజాబ్‌లో ఆప్‌కు ఏడుగురు ఎంపీలు ఉండగా, ఆరుగురు ఎంపీలు ఫిరాయించారు. మిగిలిన 2022 ఎన్నికల తర్వాత ఎన్నికైన వీరు ఆప్ ప్రతిష్ఠకు దెబ్బ తీశారు. అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలల ముందు బీజేపీకి అవకాశాలు పెరిగాయి, అయినప్పటికీ తక్షణ ప్రభావం తక్కువ.
ఆప్ దీన్ని ’ఆపరేషన్ లోటస్’గా విమర్శిస్తోంది. కేజ్రీవాల్‌కు లీక్ అవకాశం ఉండటంతో త్వరగా పూర్తి చేశారు. బీజేపీ నైతికతపై ఆరోపణలు ఎదుర్కొంటోంది. మోదీ–షా నాయకత్వం పట్ల ఆకర్షణ, పార్టీ విలీనం ద్వారా ఫిరాయి చట్టం నుంచి తప్పించుకున్నారు.