https://oktelugu.com/

AP government: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై

AP government: ఏపీలోని వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఈ సందర్భంగా ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఏపీ సర్కారు ఇచ్చిన పీఆర్సీ వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. కాగా, పీఆర్సీ వలన ఉద్యోగులకు లాభమే జరిగిందని ఏపీ అధికార పార్టీ వైసీపీ రిలీజ్ చేసిన లేఖను తప్పుబడుతున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, టీచర్లు. తమకు జరిగే నష్టాల గురించి ఏ వేదికపైనైనా వివరించేందుకు సిద్ధంగా […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 24, 2022 11:52 am
    Follow us on

    AP government: ఏపీలోని వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఈ సందర్భంగా ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఏపీ సర్కారు ఇచ్చిన పీఆర్సీ వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. కాగా, పీఆర్సీ వలన ఉద్యోగులకు లాభమే జరిగిందని ఏపీ అధికార పార్టీ వైసీపీ రిలీజ్ చేసిన లేఖను తప్పుబడుతున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, టీచర్లు. తమకు జరిగే నష్టాల గురించి ఏ వేదికపైనైనా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

    Jagan Govt

    AP CM Jagan

    అధికార వైసీపీ విడుదల తాజాగా చేసిన లేఖ ద్వారా అసత్య ప్రచారాలకు తెర లేపిందని అన్నారు. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు లేఖను తప్పుబడుతూ వివరణ ఇచ్చారు. పీఆర్సీలో జీత భత్యాలు తగ్గడం వల్లే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని, సమ్మెలో సై అని అంటున్నారని చెప్పారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అయితే, ఈ ఆందోళనను పక్కదారి పట్టించేందుకుగాను అధికార వైసీపీ కేంద్రకార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారని విమర్శించారు.

    Also Read: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీలోని అక్కమ్మ-జక్కమ్మ సిస్టర్స్ బయట ఎంత అందగత్తెలో తెలుసా..
    కొత్త పీఆర్సీలో జీత భత్యాలపైన విధించిన కోతను గురించి ఏ ప్రజా వేదికపై అయినా వివరిస్తామని టీచర్లు చెప్తున్నారు. తమకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు వద్దని, పాత పద్ధతి ప్రకారమే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు ఆపాలని కోరారు.

    PRC CM Jagan

    CM Jagan

    దేశంలో ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. తమను ప్రతిపక్ష పార్టీలు కాని వారి అనుకూల పత్రికలు కాని ప్రభావితం చేయలేదని ఉద్యోగులు చెప్తున్నారు. తమ విశ్వాసాన్ని దెబ్బ తీసే విధంగా జీత భత్యాల్లో కోతలు ఉన్నాయని, ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలోనే తాము సర్కారుకు వ్యతిరేకంగా పోరాట బాట పట్టామని తెలిపారు. ఈ నెల 17న విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులే తమలో మంటలు రేపాయని ఉద్యోగులు వివరిస్తున్నారు.

    Also Read: బోల్డ్ ఫోటో షూట్స్ తో యాంకర్ వర్షిణి రచ్చ… అవకాశాల కోసమేనా ఈ పాట్లు !

    Tags