https://oktelugu.com/

Rajinikanth Shivaji Movie: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీలోని అక్కమ్మ-జక్కమ్మ సిస్టర్స్ బయట ఎంత అందగత్తెలో తెలుసా..

Rajinikanth Shivaji Movie: ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘శివాజీ’ సినీ ప్రేక్షకులందరి ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా వసూళ్ల పర్వం కురిపించింది. బ్లాక్మ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్, ఇతర అన్ని అంశాల్లో సత్తా చాటాడు.శ్రియ రజనీకాంత్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 24, 2022 / 11:41 AM IST

    Rajinikanth Shivaji Movie

    Follow us on

    Rajinikanth Shivaji Movie: ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘శివాజీ’ సినీ ప్రేక్షకులందరి ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా వసూళ్ల పర్వం కురిపించింది. బ్లాక్మ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్, ఇతర అన్ని అంశాల్లో సత్తా చాటాడు.శ్రియ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. చిత్రంలో ఓ ఫన్నీ సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది.

    Rajinikanth Shivaji Movie:

    రజనీకాంత్ శ్రియను ప్రేమించగా, ఆయన ఇంటికి హీరో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. అయితే, పెళ్లికి శ్రియ కుటుంబీకులు నో చెప్తారు. కాగా, పరిచయం పెంచుకునేందుకుగాను దీపావళి పండుగ సందర్భంగా రజనీకాంత్ పండ్లు, ఫలహారాలతో మళ్లీ శ్రియ కుటుంబానికి వెళ్లగా, వారు ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతారు. దాంతో వారిని శ్రియ ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి ఆహ్వానిస్తాడు. తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, తన ఇంటికి రావాలని ఇన్వైట్ చేస్తాడు.

    Also Read: బోల్డ్ ఫోటో షూట్స్ తో యాంకర్ వర్షిణి రచ్చ… అవకాశాల కోసమేనా ఈ పాట్లు !

    ‘అక్కమ్మ-జక్కమ్మ’ సిస్టర్స్ అంటూ ఇద్దరు కూతుర్లను పరిచయం చేస్తాడు. అయితే, వారిరువురు డీ గ్లామర్ పాత్రల్లో కనబడుతారు. దీనిపై అప్పట్లో పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అలా ఫన్ జనరేట్ చేయడం కోసమే ఈ సీన్ తీసినట్లు స్పష్టమవుతున్నది. సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలను చూసి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నిజంగానే వీరు అలా డీ గ్లామర్ గా ఉంటారా ? అని అనుకున్నారు. ఇకపోతే ఈ పిక్చర్ వచ్చి 13 ఏళ్లు అయింది. అయితే, నిజానికి అక్కమ్మ – జక్కమ్మలు అంత డీ గ్లామర్ గా ఉండబోరు. కానీ, పాత్రల కోసం అలా నటించారు.

    Rajinikanth Shivaji Movie:

    ఇక వీరిరువురు ‘శివాజీ’ చిత్రం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే, రియల్ లైఫ్ లో వీరు చాలా అందంగా ఉంటారు. తాజాగా ఈ అక్కా చెల్లెళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి కూడా. ఇకపోతే ఆ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అక్కమ్మ,జక్కమ్మ సిస్టర్స్ అందగానే ఉన్నారని, కానీ, సినిమా కోసం అలా డీ గ్లామర్ గా కనిపించారని ఫొటోలను చూసి అర్థం చేసుకోవచ్చు.

    Also Read: ఈ ట్రెండీ రూమర్స్ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే !

    Tags