https://oktelugu.com/

Samantha: ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..

Samantha: కొన్నాళ్లుగా సమంత చర్యలు అనుమానాస్పదంగా ఉంటున్నాయి. ఆమె పరోక్షంగా చేసే కామెంట్స్ , సోషల్ మీడియా పోస్ట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. చైతన్యతో నాలుగేళ్ల బంధానికి సమంత స్వస్తి పలికారు. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చిన సమంత… అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు నుండి అక్కినేని తొలగించారు. సమంత, నాగ చైతన్యలకు చెడిందన్న అనుమానాలు మొదలైంది ఇక్కడే. ఇక మీడియా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 24, 2022 / 12:09 PM IST
    Follow us on

    Samantha: కొన్నాళ్లుగా సమంత చర్యలు అనుమానాస్పదంగా ఉంటున్నాయి. ఆమె పరోక్షంగా చేసే కామెంట్స్ , సోషల్ మీడియా పోస్ట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. చైతన్యతో నాలుగేళ్ల బంధానికి సమంత స్వస్తి పలికారు. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చిన సమంత… అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు నుండి అక్కినేని తొలగించారు. సమంత, నాగ చైతన్యలకు చెడిందన్న అనుమానాలు మొదలైంది ఇక్కడే.

    Samantha

    ఇక మీడియా వీరి గురించి సమాచారం సేకరించడం మొదలు పెట్టింది. విడివిడిగా ఉంటున్నారని తెలుకొని, సన్నిహితులను సంప్రదించగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలిసింది. దీంతో మీడియాలో సమంత-నాగ చైతన్య విడాకులపై వరుస కథనాలు వెలువడ్డాయి. అక్టోబర్ 2న సమంత అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. నాగ చైతన్య సైతం సోషల్ మీడియాలో విడాకుల తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పటికే ఈ విషయాన్ని మీడియా ధృవీకరించడం తో జనాలు పెద్దగా షాక్ కాలేదు.

    Also Read: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై

    అయితే కారణాలు ఏమిటనే ఆసక్తి మాత్రం అభిమానుల్లో నెలకొంది. ఇక సమంత-చైతన్య విడిపోవడానికి కారణం ఇదే అంటూ… పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సమంతనే టార్గెట్ చేశారు. తనపై ఆరోపణలకు సమంత పరోక్షంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగ చైతన్యను కూడా టార్గెట్ చేస్తున్నట్లు ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ ఉండేవి. సదరు పోస్ట్స్… అసలు సమంత ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ఆసక్తిని రగిలించేవి. నాగ చైతన్య మాత్రం పూర్తి మౌనం వహించాడు. విడాకుల తర్వాత లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య ఆ విషయంపై అసలు స్పందించలేదు.

    Samantha

    సమంత మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక చర్యకు పాల్పడుతూనే ఉంటుంది. నాగ చైతన్యతో సన్నిహితంగా ఉన్న అనేక ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. ఇటీవల సమంత అక్టోబర్ 2న ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విడాకుల ప్రకటన నోట్ తొలగించారు. సమంత ఎందుకు విడాకుల ప్రకటన పోస్ట్ తొలగించారు? అనేది టాలీవుడ్ లో కొత్త డిబేట్ కి దారి తీస్తుంది. ఆ పోస్ట్ ఆమె తీసివేయడం వెనుక ఉద్దేశం ఏమిటీ? సమంత మనసులో నాగ చైతన్య గురించి అసలు ఏమి రన్ అవుతుంది? వంటి అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

    సమంత విడాకుల గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండగా ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో, మరలా ఈ విషయం గురించి జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సమంత అలా ఎందుకు చేసిందో ఆమెకు మాత్రమే తెలిసిన నిజం. మరోవైపు సమంత కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. పాన్ ఇండియా చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

    Also Read: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీలోని అక్కమ్మ-జక్కమ్మ సిస్టర్స్ బయట ఎంత అందగత్తెలో తెలుసా..

    Tags